News


రివ్వుమన్న నిత్యావసర వస్తువుల టోకు ధర

Tuesday 17th December 2019
news_main1576554234.png-30263

  • రివ్వుమన్న నిత్యావసర వస్తువుల టోకు ధర
  • నవంబర్లో 0.58 శాతం పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
  • స్పష్టంగా కనిపిస్తున్న డిమాండ్‌ రహిత స్థితి

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌ గణాంకాలు వ్యవస్థలో మందగమన స్థితికి అద్దం పట్టాయి. ధరల స్పీడ్‌ కేవలం 0.58 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 నవంబర్‌లో టోకు ధరల బాస్కెట్‌తో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో అదే బాస్కెట్‌ ధర కేవలం 0.58 శాతమే పెరిగిందన్నమాట. అయితే సామాన్యునికి సంబంధించి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఉల్లిపాయ ధరలు వార్షికంగా చూస్తే, ఏకంగా 172 శాతం పెరిగాయి. ఈ ధరలూ పెరగకపోతే, టోకు ద్రవ్యోల్బణం క్షీణతలోకి జారిపోయేదని అంచనా. 2019 అక్టోబర్‌లో ద్రవ్యో‍ల్బణం 0.16 శాతం అయితే 2018 నవంబర్‌లో ఈ రేటు 4.47 శాతం. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...
- తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల అసలు నమోదుకాలేదు. 2018 నవంబర్‌తో పోల్చితే 2019 నవంబర్‌లో ఈ బాస్కెట్‌ ధర -0.84 శాతం క్షీణించింది. 2018 నవంబర్‌లో ఈ రేటు 4.21 శాతం.  
- ఇంధనం, విద్యుత్‌: సూచీలో దాదాపు 22 శాతం వెయిటేజ్‌ ఉన్న ఈ విభాగంలో కూడా ద్రవ్యోల్బణం -7.32 శాతం క్షీణించింది. గత ఏడాది నవంబర్‌లో ఈ విభాగంలో ద్రవ్యో‍ల్బణం 15.54 శాతం. 
- ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్‌, నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం భారీగా 7.68 శాతం పెరిగింది. 2018 నవంబర్‌లో ఈ రేటు 0.59 శాతం మాత్రమే. ఇక ఇందులోనూ నాన్‌-ఫుడ్‌ ఆర్టికల్స్‌ విభాగాన్ని చూసుకుంటే ద్రవ్యోల్బణం 6.40 శాతం నుంచి 1.93 శాతానికి తగ్గింది. 
సామాన్యుడిపై భారం...
ఫుడ్‌ ఆర్టికల్స్‌ చూస్తే... 2018 నవంబర్‌లో అసలు ఈ విభాగంలో పెరుగుదల నమోదుకాకపోగా, -3.24 శాతం క్షీణతలో ఉంది. అయితే తాజా సమీక్షా నెల నవంబర్‌లో ఈ బాస్కెట్‌ ధర ఏకంగా 11.08 శాతం ఎగసింది. గడచిన 71 నెలల్లో ఈ స్థాయిలో ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం ఇదే తొలిసారి.  అక్టోబర్‌లో ఈ రేటు 9.80 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు 172 శాతం పెరిగితే, కూరగాయల విషయంలో ఈ ధర స్పీడ్‌ 45.32 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు టోకున 16.59 శాతం ఎగశాయి. 



You may be interested

భారత ఉక్కు రంగంలోకి ఆర్సెలర్‌ మిట్టల్‌

Tuesday 17th December 2019

పూర్తయిన ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌ దివాలా చట్టం కింద పరిష్కారమైన అతి పెద్ద కేసు న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ ఎట్టకేలకు భారత ఉక్కు రంగంలోకి అరంగేట్రం చేసింది. రచ్చ గెలిచిన లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ ఇంట గెలవడానికి చాలా సమయం పట్టింది. చాలా ఏళ్ల సమయం, ప్రయాసల అనంతరం ఆయన ఉక్కు కంపెనీ ఆర్సెలర్‌ మిట్టల్‌ మన దేశంలోకి అడుగిడింది. భారత్‌లో ఉక్కు కంపెనీని ఏర్పాటు చేయాలన్న ఎల్‌ఎన్‌ మిట్టల్‌

జియో-బీపీ బ్రాండ్‌ పేరుతో పెట్రోల్‌ బంకులు

Tuesday 17th December 2019

న్యూఢిల్లీ: ఇంధన రిటైల్‌ విభాగంలో వ్యాపారం విషయమై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీ సోమవారం ఒప్పందం చేసుకున్నాయి. ఆగస్ట్‌లో చేసుకున్న ఒప్పందానికి కొనసాగింపుగా తప్పనిసరి ఒప్పందానికి వచ్చాయి. 2020 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జాయింట్‌ వెంచర్‌ కార్యరూపం దాల్చవచ్చని అంచనా. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిని కూడా జాయింట్‌ వెంచర్‌ కిందకు తీసుకురానున్నారు. మొత్తం 5,500 విక్రయ కేంద్రాలకు విస్తరించాలన్నది లక్ష్యం. జాయింట్‌

Most from this category