News


ఎంఎస్‌ఎంఈలలకు కేంద్రం వరం!

Friday 20th September 2019
news_main1568951204.png-28440

  • 2020 మార్చి వరకు ఎన్‌పీఏలుగా ప్రకటించొద్దు
  • ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచనలు
  • వచ్చే నెల దేశవ్యాప్తంగా రుణ మేళాలు
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను కోరింది. వాటి రుణాల పునరుద్ధరణపై పనిచేయాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్‌పీగా ప్రకటించొద్దంటూ ఆర్‌బీఐ ఉత్తర్వులు ఇప్పటికే అమల్లో ఉన్నట్టు చెప్పారు. ఈ ఆదేశాలను అనుసరించాలని, 2020 మార్చి వరకు ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి ఒత్తిడిలోని రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించొద్దని కోరినట్టు ఆమె చెప్పారు. ఆయా రుణాల పునర్నిర్మాణంపై పనిచేయాలని సూచించామన్నారు. ఇది ఎంఎస్‌ఎంఈ రంగానికి మేలు చేస్తుందన్నారు. 
ఎన్‌బీఎఫ్‌సీలతో కలసి రుణాలు...
బ్యాంకులు కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలను గుర్తించాయని.. ఆయా ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని మంత్రి సీతారామన్‌ తెలిపారు. దాంతో లిక్విడిటీ మెరుగవుతుందని, అవసరమైన వర్గాలకు రుణాలు అందుతాయన్నారు. దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు, రిటైల్‌ రుణ గ్రహీతలతో కలసి సమావేశాలు నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. వీటి ద్వారా గృహ కొనుగోలుదారులకు, రైతులకు, ఇతరులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముందుగా అక్టోబర్‌ 3-7వ తేదీల మధ్య 200 జిల్లాల్లో, మిగిలిన 200 జిల్లాల్లో అక్టోబర్‌ 11 తర్వాత నుంచి ఈ సమావేశాల ఏర్పాటు ఉంటుందన్నారు. పండుగల సమయంలో సాధ్యమైనన్ని రుణాలను అందించడమే వీటి ఉద్దేశ్యంగా చెప్పారు. You may be interested

వృద్ధికి చర్యలు లోపించాయి

Friday 20th September 2019

దానిపైనే పనిచేస్తున్నా.. చూస్తున్నారుగా..? ట్విట్టర్‌పై కిరణ్‌ మజుందార్‌, ఆర్థిక మంత్రి సంవాదన న్యూఢిల్లీ: ట్విట్టర్‌ వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వృద్ధికి మద్దతునిచ్చే చర్యలు లోపించాయంటూ షా విమర్శించారు. ట్విట్టర్‌పై విమర్శలకు సహజంగా బదులివ్వని నిర్మలా సీతారామన్‌.. షా విమర్శలకు మాత్రం స్పందించారు. ‘‘మీరు గమనించే ఉంటారు ఆర్థిక మంత్రిగా నేను ఆ

ఈ షేర్లు.. ఏడారిలో మంచినీటి చెలమలు..?

Friday 20th September 2019

ఈ ఏడాది ఇంత వరకు ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్లు నికరంగా లాభాలను ఇచ్చిందేమీ లేదు. చాలా స్టాక్స్‌ కొత్త కనిష్టాలకు చేరాయి. ఇంకా పడిపోతూనే ఉ‍న్నాయి. కానీ, ఇంత ప్రతికూల వాతావరణంలోనూ ఇటీవల ఐపీవోలు ముగించుకుని స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన కొన్ని మాత్రం లాభాల మెరుపులు మెరిపిస్తున్నాయి.    హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఈ షేరు ఈ నెల 12న రూ.2,697.50 ధర పలికింది. అదే రోజు నాటికి, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జూన్‌ 4న

Most from this category