News


స్థిరత్వం శుభ సంకేతం!

Saturday 29th February 2020
news_main1582947612.png-32172

  • వృద్ధి తీరుపై ఆర్థికమంత్రి

భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదుకావడాన్ని ఆర్థిక రంగంలో ‘‘స్థిరత్వం’’గా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థకు ఇది ఒక శుభ సంకేతమనీ విశ్లేషించారు.  సీఎన్‌బీసీ టీవీ 18 బిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి  ఈ సందర్భంగా మాట్లాడుతూ,  వృద్ధి రేటు మరికొంతకాలం ఇదే స్థాయిలో స్థిరంగా ఉండే వీలుందని పేర్కొన్నారు. కోవిడ్‌-19 గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, తక్షణం భయపడాల్సింది ఏదీ లేదన్నారు. అయితే సమస్యలు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే మాత్రం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రస్తుతం బ్యాంకింగ్‌కు ప్రభుత్వం మద్దతు నిస్తోందని తెలిపారు. రిటైల్‌, గృహ, వ్యవసాయ రంగాలుసహా అన్ని కేటగిరీలకు తగిన రుణాలు సకాలంలో అందించడానికి బ్యాంకింగ్‌కు మూలధనం అందిస్తున్నట్లు తెలిపారు. 



You may be interested

జనవరిలో మౌలిక రంగం వృద్ధి 2.2 శాతం

Saturday 29th February 2020

న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ వృద్ధి జనవరిలో కొంచెం కోలుకుని 2.2 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఈ గ్రూప్‌ ఏప్రిల్‌-జనవరి మధ్య 0.6 శాతం మాత్రమే వృద్ధిని నమోదుచేసుకుంది. శుక్రవారం విడుదలైన గణాంకాలకు సంబంధించి ఎనిమిది విభాగాలనూ వేర్వేరుగా చూస్తే.... వృద్ధిలో ఐదు - బొగ్గు పరిశ్రమ ఉత్పత్తి 8 శాతం పెరిగింది. రిఫైనరీ ప్రొడక్టుల్లో వృద్ధి 1.9 శాతం కాగా,

జెనీవా ఆటో షో రద్ధు

Saturday 29th February 2020

కోవిడ్-19 వైరస్(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్ ప్రభుత్వం శుక్రవారం నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయ్యింది. ఇప్పటికే 15 కేసులను గుర్తించిన స్విస్‌ ప్రభుత్వం.. ఈ మహమ్మారి వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం ఈ

Most from this category