News


రూ.100 లక్షల కోట్ల ఇన్‌ఫ్రా ప్రణాళిక ఇదిగో: నిర్మలా సీతారామన్‌

Tuesday 31st December 2019
news_main1577789238.png-30567

  • మరో రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు రెడీ చేస్తాం
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

జాతీయస్థాయిలో చేపట్టే 102 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆవిష్కరించారు. ప్రధాని పేర్కొన్న 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సాధించే దిశగా ఈ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని, స్వల్ప వ్యవధిలో ఈ టాస్క్‌ఫోర్స్‌ దాదాపు 70కి పైగా స్టేక్‌హోల్డర్లతో సం‍ప్రదింపులు జరిపిందని తెలిపారు. ఒక్కొక్కటి రూ. వంద కోట్ల విలువ చేసే పది మేజర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను టాస్క్‌ఫోర్స్‌ రూపొందించనుందన్నారు. ప్రస్తుత వృద్ధి రేటును బలోపేతం చేయాలంటే 2030నాటికి ఇండియా దాదాపు 4.5 లక్షల కోట్ల డాలర్లను ఇన్‌ఫ్రాపై వెచ్చించాల్సిఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్‌ఐపీ కింద గుర్తించిన రంగాలు, ప్రాజెక్టులు, వ్యయాలు...


 గత ఆరేళ్లలో రాష్ట్ర, కేంద్రాలు కలిసి ఇన్‌ఫ్రాపై రూ.51లక్షల కోట్లను వ్యయం చేశాయని నిర్మలా చెప్పారు. కొత్తగా చేపట్టే ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు విద్యుత్‌, రైల్వే, అర్బన్‌ ఇరిగేషన్‌, మొబిలిటీ, విద్య, ఆరోగ్యరంగాలకు సంబంధించి ఉంటాయన్నారు. వీటితో పాటు రూ. 2.5 లక్షల కోట్ల ఓడరేవు, విమానాశ్రయ ప్రాజెక్టులను, రూ. 3.2 లక్షల కోట్ల డిజిటల్‌ ఇనఫ్రా ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు. త్వరలో ఈ ఎన్‌ఐపీ(నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌) సమన్వయ విధానాలను విడుదల చేస్తామని, వీటిద్వారా కొత్త ప్రాజెక్టుల పర్యవేక్షణ జరుపుతామని వివరించారు. 



You may be interested

2020లో మార్కెట్లు ఎలా ఉండొచ్చు..?

Tuesday 31st December 2019

నూతన సంవత్సరంలో ఇన్వెస్టర్లు ఏ రంగాలను నమ్ముకోవచ్చు..? 2020లో ర్యాలీకి అవకాశం ఉన్న రంగాలేవి..? ఏ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులు పొందొచ్చు? ఇలాంటి ఎన్నో సందేహాలను తొలగించే విధంగా 2020పై పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో శ్రీనివాస్‌ రావూరి ఓ వార్తా పత్రికకు రాసిన కాలమ్‌లో స్పష్టతనిచ్చారు (ఆయన మాటల్లోనే).  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని పీజీఐఎం మ్యూచువల్‌ ఫండ్‌ గతంలో

క్షీణించిన ఐటీ షేర్లు

Tuesday 31st December 2019

ఐటీ రంగ షేర్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఎన్‌ఎన్‌ఈలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 0.78శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 15,754.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెక్ మహీంద్రా, టీసీఎస్‌, విప్రో లాంటి షేర్లు 2శాతం పతనం కారణంగా ఇంట్రాడేలో 1శాతం నష్టపోయి 15,634.50 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతమైనంది. ఇంట్రాడేలో ఈ రంగానికి చెందిన టెక్‌ మహీంద్రా 3శాతం, జస్ట్‌ డయల్‌ 2శాతం, విప్రో, టాటా

Most from this category