News


ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ కేసులకు క్షమాపణ పథకం

Saturday 6th July 2019
news_main1562398596.png-26862

  • రూ.3.75 లక్షల కోట్ల పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చర్యలు

న్యూఢిల్లీ: సేవల పన్ను, ఎక్సైజ్‌ సుంకాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న రూ.3.75 లక్షల కోట్ల విలువకు సంబంధించి కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ‘సబ్‌కా విశ్వాస్‌ లెగసీ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ స్కీమ్‌ 2019’ అనే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిల్లో 40 నుంచి 70 శాతం వరకు ఉపశమనం లభించనుంది. స్వచ్చందంగా వెల్లడించిన కేసులు కాకుండా ఇతర కేసులకు ఇది వర్తిస్తుంది. అలాగే, వడ్డీ, పెనాల్టీల నుంచి కూడా వెసులుబాటు ఈ పథకం కింద లభించనుంది. సేవల పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీ, మరో 15 ఇతర పరోక్ష పన్నులన్నీ కూడా జీఎస్‌టీలో కలిసిపోయిన విషయం తెలిసిందే. జీఎస్‌టీకి ముందు నాటి వివాదాలు పెద్ద ఎత్తున అపరిష్కృతంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇలా పెండింగ్‌లో ఉండిపోయిన కేసుల మొత్తం విలువ రూ.3.75 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఈ భారాన్ని తప్పించి వ్యాపారాలు సజావుగా నడిచేలా చూడాల్సి ఉందన్నారు. అందుకే సత్వర పరిష్కారానికి పథకాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. 



You may be interested

వ్యవసాయానికి పెద్దపీట

Saturday 6th July 2019

 రైతు ఆదాయం రెట్టింపుపై కేంద్రం దృష్టి వ్యవసాయం, ఆధారిత రంగాల్లో భారీగా పెట్టుబడులు  ప్రైవేటు పెట్టుబడులకు ‍ప్రోత్సాహం ఇస్తామన్న కేంద్ర మంత్రి అన్నదాత వెలుగు ప్రదాతంటూ ప్రశంస మత్స్యకార, పాడిపరిశ్రమలకూ భారీగా ప్రోత్సాహకాలు జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై దృష్టిపెడతాన్న సీతారామన్‌ న్యూఢిల్లీ: 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. దీంతోపాటుగా వ్యవసాయాధారిత రంగాల్లో మౌలికసవతుల కల్పనను ప్రోత్సహించే చర్యలకు ఆమోదం తెలిపింది.

మహిళా సంక్షేమానికి పెద్దపీట

Saturday 6th July 2019

న్యూఢిల్లీ: ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళ, శిశు అభివృద్ధితోపాటు సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2019-20 సంవత్సరానికిగాను మొత్తం 29, 000 కోట్ల రూపాయలు మహిళా, శిశు సంక్షేమానికి, అభివృద్ధికి వెచ్చించనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో రూ.19,834.37 కోట్లు అంగన్‌వాడీ సేవలకు వెచ్చిస్తారు. పౌష్టికాహారం, సామాజిక భద్రత, సంక్షేమ రంగాలకు రూ.4,178 కోట్లు దక్కగా.. గత ఏడాది ఈ

Most from this category