News


వృద్ధికి మరింత కలసి పనిచేయాలి

Friday 28th June 2019
news_main1561710064.png-26657

  • ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు కొనసాగించాలి
  • ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు

ముంబై: నిదానించిన దేశ జీడీపీ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ మరింత సన్నిహితంగా కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అభిప్రాయపడ్డారు. వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోవడం ద్రవ్య గణాంకాలపై ఒత్తిళ్లకు దారి తీస్తున్నట్టు ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికలో గవర్నర్‌ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణకు ఉమ్మడి చర్యలు అవసరమని, ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. నిదానించిన వృద్ధికి మద్దతునిచ్చేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్‌ ఇప్పటికి మూడు విడతల్లో పావు శాతం చొప్పున మొత్తం 0.75 శాతం రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే. వ్యవస్థాగతమైన స్థిరత్వం కోసం దేశీయంగా ద్రవ్య, ఆర్థిక సమన్వయంతోపాటు అంతర్జాతీయంగా భారీ సమన్వయం అవసరం ఉందని దాస్‌ అభిప్రాయపడ్డారు. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు వివేకంతో కూడిన నియంత్రణలను అభివృద్ధి చేసుకోవాలని, ఆస్తుల బాధ్యతల నిర్వణపై, తమ బలాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరులో పురోగతి ఉన్నట్టు చెప్పారు. ప్రొవిజన్‌ కవరేజీ రేషియో, మూలధన నిధుల్లో పెరుగుదల ఉందన్నారు. పరిపాలన సంస్కరణలపై, తమ బ్యాలన్స్‌ షీట్ల బలోపేతంపై అవి దృష్టి పెట్టాలని సూచించారు. 
ఆర్థిక రంగం స్థిరంగానే...
ఆర్థిక రంగం స్థిరంగానే ఉందని, బ్యాంకుల్లో ఎన్‌పీఏల రేషియో 9.3 శాతానికి తగ్గినట్టు ఈ నివేదికలో ఆర్‌బీఐ పేర్కొంది. ఏడాది క్రితం 11.2 శాతంగా ఉండగా, ఈ మార్చి నాటికి 9.3 శాతానికి తగ్గినట్టు తెలిపింది. 2020 మార్చి నాటికి ఎన్‌పీఏలు 9 శాతానికి తగ్గుతాయని అంచనా వేసింది. మొత్తం ఎన్‌పీఏల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల పరంగా కొంచెం ఎక్కువగా 12.6 శాతం ఉండగా, 2020 మార్చి నాటికి 12 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. అంతర్జాతీయ రిస్క్‌లు, స్థూల ఆర్థిక పరిస్థితుల పరంగా ఉన్న రిస్క్‌లను పరిగణనలోకి తీసుకున్న మీదట, ఫైనాన్షియల్‌ మార్కెట్‌ సమస్యలు అధిక రిస్క్‌ కేటగిరీలోనే ఉన్నాయని భావిస్తున్నట్టు ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. You may be interested

డబుల్‌ టాప్‌, డబుల్‌ బాటమ్‌ అంటే...?

Friday 28th June 2019

మార్కెట్లో షేరు ధరలను అధ్యయనం చేసి ట్రెండ్‌ను గుర్తించడంలో డబుల్‌టాప్‌, డబుల్‌ బాటమ్‌ ఉపయోగపడుతుంటాయి. ఒకే ధర వద్ద కొంత కాలపరిమితి తేడాతో ఏర్పడే కచ్ఛితమైన టాప్‌లను డబుల్‌టాప్‌ అని, కచ్ఛితమైన బాటమ్‌లను డబుల్‌ బాటమ్‌లని అంటారు. సాధారణంగా ఈ స్థాయిల వద్ద ట్రెండ్‌ రివర్సల్‌కు అవకాశాలుంటాయి. ఒక షేరు నిర్ణీత ధర వరకు చేరుకొన్న తర్వాత కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా కరెక‌్షన్‌ వస్తుంది. దీని తర్వాత బుల్స్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌పై మరిన్ని నిబంధనలు...

Friday 28th June 2019

లిక్విడిటీ సంక్షోభం నేపథ్యంలో సెబీ నిర్ణయాలు  యథాతథ ఒప్పందాలు వద్దు లిక్విడ్‌ స్కీమ్స్‌పై ఆంక్షలు  అధిక ఓటింగ్‌ హక్కులున్న డీవీఆర్‌షేర్లు జారీ  టెక్నాలజీ కంపెనీలకే ఈ వెసులుబాటు  సెబీ నిర్ణయాలతో మరింత పారదర్శకత అంటున్న నిపుణులు  ముంబై: కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీల్లో ఇటీవల తలెత్తిన లిక్విడిటీ సంక్షోభం నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుంది. గురువారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు.

Most from this category