News


కార్పొరేట్లను తిట్టడం ఫ్యాషనైపోయింది..

Thursday 25th October 2018
news_main1540445843.png-21469

న్యూఢిల్లీ: కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలను ప్రదాని నరేంద్ర మోదీ మరోసారి సమర్ధించారు. కార్పొరేట్లు వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేస్తున్నప్పటికీ.. వారిని తిట్టడం ఫ్యాషన్‌గా మారిందని మోదీ ఆక్షేపించారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ఐటీ నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలతో బుధవారం చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు అత్యుత్తమంగా సామాజిక సేవ చేస్తుండటం, తమ ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండటం మనం చూస్తున్నాం. ఎందుకో తెలియదు కానీ మన దేశంలో వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను విమర్శిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదో ఫ్యాషన్‌గా మారింది. ఇది నాకు ఆమోదయోగ్యమైన విషయం కాదు" అని మోదీ పేర్కొన్నారు. కార్పొరేట్లను మోదీ సమర్ధించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కూడా కీలకపాత్ర పోషించారని, వారితో కలిసి కనిపించడానికి తాను భయపడబోనని జూలైలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  
పన్నులు కట్టడమే కాదు.. 
సమాజ సేవా చేయాలి..
కేంద్రం ప్రజా ధనాన్ని సద్వినియోగం చేస్తోందన్న నమ్మకం కలగడం వల్లే తమ ప్రభుత్వ హయాంలో పన్నులు సక్రమంగా చెల్లించే వారి సంఖ్య పెరిగిందని మోదీ చెప్పారు. అయితే, సామాజిక బాధ్యత కింద నిజాయితీగా పన్నులు చెల్లించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పౌరులు తమ వంతుగా మరికాస్త పాటుపడాలని సూచించారు. "పన్నులు చెల్లించడమన్నది సహజసిద్ధమైన ప్రకృతి. కట్టకపోవడమన్నది వికృతి. కానీ పన్నులు సక్రమంగా కట్టడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మరికాస్త పాటుపడటమనేది సంస్కృతి" అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు టెక్నాలజీపరమైన పరిష్కారమార్గాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలని ఐటీ నిపుణులకు ప్రధాని సూచించారు. టీసీఎస్‌, కాగ్నిజెంట్ తదితర ఐటీ కంపెనీలు తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక‍్రమాల గురించి వివరించాయి. కొత్తగా ప్రారంభించిన సెల్ఫ్‌4సొసైటీకి మద్దతు తెలిపాయి. You may be interested

విప్రో లాభం 14 శాతం డౌన్‌

Thursday 25th October 2018

న్యూఢిల్లీ/బెంగళూరు: ఐటీ సేవల దిగ్గజం విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 14 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,192 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,889 కోట్లకు తగ్గింది. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 10 శాతం తగ్గింది. అయితే కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.13,423 కోట్ల నుంచి 8 శాతం పెరిగి

జోరందుకున్న ఎయిర్‌ జర్నీ

Thursday 25th October 2018

ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య గతనెలలో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 114 లక్షల మంది దేశీ విమానాల్లో ప్రయాణం చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా విడుదలచేసిన డేటా ద్వారా వెల్లడైంది. ఏడాది ప్రాతిపదికన 18.95 శాతం రేటు వృద్ధి నమోదైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్‌లో 95.83 లక్షల మంది ప్రయాణికులు దేశీ విమానాల్లో ప్రయాణం చేశారు. గతనెలలో ఎయిర్‌

Most from this category