News


జీడీపీలో సగం వాటాకు ‘ఎంఎస్‌ఎంఈ’..!

Saturday 6th July 2019
news_main1562390468.png-26835

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక (ఎంఎస్‌ఎంఈ) రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రంగం గణనీయంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. దేశ జీడీపీలో ప్రస్తుతం 29 శాతం వాటాను కలిగిన ఎంఎస్‌ఎంఈ.. వచ్చే 5 ఏళ్లలో 50 శాతం వాటా స్థాయికి చేరుకునేలా తమ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటోందని వివరించారు. ఈ సమయంలో 5 కోట్ల ఉద్యోగాల కల్పన జరగనుందని అంచనావేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చిన కేటాయింపులపై స్పందించిన ఆయన.. ‘చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గరిష్ట ప్రోత్సాహం లభించడం ఈ బడ్జెట్ ప్రత్యేకతగా నిలిచింది. ఇప్పటివరకు ఈ రంగంలో 11 కోట్ల మందికి ఉపాధి లభించింది. వచ్చే 5 ఏళ్లలో మరో 5 కోట్ల ఉద్యోగాల కల్పన ద్వారా ఎంఎస్‌ఎంఈ ఉద్యోగుల మొత్తం సంఖ్య 15 కోట్లను మించనుంది’ అని పేర్కొన్నారు. 


 



You may be interested

1,174 కంపెనీలు వాటా విక్రయించాలి

Saturday 6th July 2019

పబ్లిక్‌ హోల్డింగ్‌ 25 శాతం నుంచి 35 శాతానికి ! పెంచాలంటూ ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి  తగిన సమయం ఇవ్వాలంటున్న నిపుణులు  రూ.3.87 లక్షల కోట్ల విలువైన షేర్ల విక్రయం !  న్యూఢిల్లీ: ఒక కంపెనీలో ప్రజలకుండే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రతిపాదించారు. కంపెనీలో ప్రజల వాటాను 35 శాతానికి పెంచడానికి ఇదే సరైన సమయమని తన తొలి బడ్జెట్‌లో ఆమె ప్రతిపాదించారు. క్యాపిటల్‌

ఆర్‌బీఐ నుంచి రూ.90,000 కోట్ల డివిడెండ్‌

Saturday 6th July 2019

వచ్చే నెలలో కేంద్రానికి  న్యూఢిల్లీ: ఆర్‌బీఐ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల డివిడెండ్‌ లభించవచ్చని అంచనా వేస్తున్నామని ఆర్థిక కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ చెల్లించిన డివిడెండ్‌, రూ.68,000 కోట్లుతో పోల్చితే ఇది 32 శాతం అధికమని వివరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ చెల్లించిన అత్యధిక డివిడెండ్‌ ఇప్పటిదాకా ఇదేనని తెలిపారు. ఆర్‌బీఐ సాధారణంగా జూలై-జూన్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా

Most from this category