STOCKS

News


రుణాలు ఇక పండగే..!

Thursday 8th August 2019
news_main1565240545.png-27623

  • 7 శాతం నుంచి 6.9 శాతానికి జీడీపీ అంచనాలు తగ్గింపు
  • వరుసగా నాలుగో విడత రెపో రేటుకు కోత
  • 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ
  • 5.4 శాతానికి దిగొచ్చిన రెపో రేటు
  • 5.15 శాతానికి రివర్స్‌ రెపో రేటు
  • సర్దుబాటు ధోరణి కొనసాగింపు
  • డిమాండ్‌, పెట్టుడులు పెంచడమే ప్రాధాన్యం: ఎంపీసీ

ముంబై: క్షీణిస్తున్న దేశ ఆర్థిక వృద్ధి, పడిపోతున్న డిమాండ్‌ ఆర్‌బీఐనీ ఆందోళనకు గురిచేస్తోంది..! బుధవారం వెల్లడైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష నిర్ణయాల్లో ఇదే తేటతెల్లమైంది. వృద్ధి క్షీణతకు చెక్‌ పెట్టేందుకు, వ్యవస్థలో డిమాండ్‌ పెంచేందుకు తన వంతుగా రేట్ల కోతతో ముందుకు వచ్చింది. 25 బేసిస్‌ పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేయగా, ఈ విషయంలో ఆర్‌బీఐ విశాలంగానే స్పందించి 35 బేసిస్‌ పాయింట్లను తగ్గించి ఆశ్చర్యపరిచింది. బ్యాంకులకు సమకూర్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా పేర్కొంటారు. ‘‘25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు సరిపోదు. 50 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు ఎక్కువ అవుతుంది. 35 బేసిస్‌ పాయింట్లు అన్నది సమతుల్యంగా ఉంటుందని ఎంపీసీ భావించింది’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. సాధారణంగా ఆర్‌బీఐ పావు శాతం లేదా అరశాతం (25 బేసిస్‌ పాయింట్ల మల్టిపుల్‌లో) మేర రేట్లలో చేసే మార్పులకు, 35 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు అన్నది వినూత్నమే. గత డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు ఆర్‌బీఐ 1.1 శాతం మేర రెపో రేటును తగ్గించడం ఆర్థిక రంగ పరిస్థితికి అద్దం పడుతోంది. తాజా నిర్ణయం తర్వాత రెపో రేటు 5.4 శాతానికి, రివర్స్‌ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ సమీకరించే నిధులపై ఇచ్చే రేటు) 5.15 శాతానికి దిగొచ్చాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జీడీపీ వృద్ధి అంచనాలను గతంలో ఉన్న 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. సర్దుబాటు ధోరణిని కొనసాగించింది. అంటే పాలసీ విషయంలో ఉదారంగా వ్యవహరించే వెసులుబాటు ఈ విధానంలో ఉంటుందని ఆశించొచ్చు. అవసరమైతే భవిష్యత్తులోనూ రేట్ల కోత చేపట్టవచ్చని ఇది సూచిస్తుంది.
బలహీనంగా ఆర్థిక రంగం...
‘‘దేశీయ ఆర్థిక రంగ కార్యకలాపాలు బలహీనంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం వృద్ధి తగ్గే రిస్క్‌ను పెంచుతున్నాయి. వృద్ధిపై ఆందోళనలకు పరిష్కారంగా డిమాండ్‌ను పెంచేందుకు, ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం అన్నది ఈ దశలో అత్యంత ముఖ్యమైనది’’ అని రేట్ల కోత అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఎంపీసీ స్పష్టం చేసింది. 
మందగమనమే...
‘‘డిమాండ్‌, పెట్టుబడులు తగ్గిపోవడం వృద్ధిపై ప్రభావం చూపిస్తోంది. ఈ దశలో వృద్ధి మందగమనం అన్నది చక్రీయమే కానీ, అది వ్యవస్థాపరమైన మందగమనం కాదు. అయినప్పటికీ నిర్మాణాత్మక సంస్కరణల అవసరం ఉంది. వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నుంచి పుంజుకోవచ్చు’’ 
- శక్తికాంతదాస్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ 

పాలసీలో ప్రముఖ అంశాలు
- రెపో రేటు 5.4 శాతం. రివర్స్‌ రెపో రేటు 5.15 శాతం. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌) రేటు 5.65 శాతంగా ఉన్నాయి. 
- 2010 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటు ఇంత తక్కువ స్థాయికి రావడం ఇదే మొదటి సారి. 
- ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఇద్దరు 25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపునకు అనుకూలంగా ఓటు వేయగా, నలుగురు 35 బేసిస్‌ పాయింట్లకు మొగ్గు చూపారు. 
- క్రితం మూడు ఎంపీసీ సమీక్షల్లో పావు శాతం చొప్పున రేట్ల కోత విధించగా, తాజా తగ్గింపు నాల్గవది. 
- వరుసగా నాలుగు పర్యాయాలు రేట్ల కోత తగ్గింపు అన్నది గతంలో 2012 ఏప్రిల్‌ నుంచి 2013 మే మధ్య చోటు చేసుకుంది. అప్పుడు మొత్తం మీద 1.25 శాతం మేర రేట్లను తగ్గించారు. దాంతో నాడు 8.50 శాతం నుంచి 7.25 శాతానికి రెపో రేటు దిగొచ్చింది. 
- వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ త్రైమాసికానికి 3.1 శాతంగా, ఆ తర్వాత రెండు త్రైమాసికాల్లో 3.5-3.7 శాతం మధ్య ఉండొచ్చని ఎంపీసీ అంచనా వేసింది. మొత్తం మీద 12 నెలల కాలానికి ప్రస్తుత అంచనాల పరిధిలోనే ద్రవ్యోల్బణం ఉంటుందని పేర్కొంది.
- చెల్లింపుల మోసాల సమాచారాన్ని తెలియజేసేందుకు కేంద్రీకృత రిజిస్ట్రీ ఏర్పాటుకు నిర్ణయం. ఆర్థిక మోసాలు జరిగితే ఇది సత్వరమే స్పందిస్తుంది. You may be interested

ఆర్‌బీఐ పాలసీపై నిపుణుల స్పందన

Thursday 8th August 2019

రేట్ల తగ్గింపు వృద్ధికి తోడ్పాటు ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం అసాధారణమైనదని బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపే కొనసాగిస్తూ, వృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. అయితే, ఇది మాత్రమే చాలదని, వినియోగాన్ని, పెట్టుబడులను పెంచేందుకు మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.  రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లను తగ్గించడం అసాధారణమే. మార్కెట్లు ఊహించని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో మానిటరీ

ఫలితాల ప్రభావం..నష్టాల్లో టాటా స్టీల్‌

Thursday 8th August 2019

ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికంలో టాటా స్టీల్‌ ఆదాయ వృద్ధి పడిపోవడంతో పాటు, నికర లాభం 64.3 శాతం క్షీణించి రూ. 693 కోట్లుగా నమోదు కావడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం నష్టాల్లో ట్రేడవుతోంది. క్యూ1 ఫలితాలతో పాటు, సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజి సంస్థ ఈ కంపెనీ స్టాకుపై ‘సెల్‌’ కాల్‌ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను రూ. 395 నుంచి రూ.320 తగ్గించడం కూడా ఈ షేరుపై

Most from this category