News


భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత

Monday 17th February 2020
news_main1581935723.png-31863

  • కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ఎఫెక్ట్‌ 

2020 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత జీడీపీ వృద్ధి అవుట్‌లుక్‌ను 6.6.శాతం నుంచి 5.4శాతానికి తగ్గించింది. అలాగే 2021 సంవత్సరపు జీడీపీ వృద్ధి అవుట్‌లుక్‌కు సైతం 6.7శాతం నుంచి 5.8శాతానికి కోత విధించింది.    ఇటీవల చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావంతో మందగించిన అంతర్జాతీయ వృద్ధి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ రికవకి అడ్డంకిగా మారుతుందని మూడీస్‌ తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో రికవరీ ప్రారంభం కావచ్చని అయితే ఇది ఊహించిన దానికంటే నెమ్మదిగా ఉండవచ్చని మోడీస్‌ పేర్కోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్‌ జీడీపీ వృద్ధి 4.5శాతం పతనమైంది.  కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ అవకాశాలను తగ్గించిందని ఈ సందర్భంగా మూడీస్ తెలిపింది. 



You may be interested

మూడీస్‌ దెబ్బ- మూడో రోజూ నేలచూపే

Monday 17th February 2020

సెన్సెక్స్‌ 202 పాయింట్లు మైనస్‌ 2020లో దేశ ఆర్థిక వృద్ధి 5.4 శాతమే మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తాజా అంచనా పీఎస్‌యూ బ్యాంక్స్‌ పతనం కరోనా వైరస్‌, జీడీపీ అంచనాలలో మూడీస్‌ కోత దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. ఫలితంగా వరుసగా మూడో రోజు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 41,056 వద్ద నిలవగా.. నిఫ్టీ 68 పాయింట్లు తక్కువగా 12,046 వద్ద ముగిసింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను తాజాగా

ఐటీ షేర్లు ఆప్‌

Monday 17th February 2020

సోమవారం బలహీనంగా ఉన్న మార్కెట్లో ఐటీ షేర్లు పెరిగాయి. నిఫ్టీ​ఐటీ ఇండెక్స్‌ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 0.03 శాతం పెరిగి 16,647.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.ఈ ఇండెక్స్‌లో భాగమైన మైండ్‌ట్రీ 2.35 శాతం పెరిగి 982.50 వద్ద, టీసీఎస్‌ 1.09 శాతం పెరిగి 2,207.97 వద్ద, ఇన్ఫోసిస్‌ 0.36 పెరిగి 789.25 వద్ద, విప్రో 0.31 పెరిగి 243.65 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. టెక్‌మహీంద్ర లిమిటెడ్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌,

Most from this category