STOCKS

News


జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గించిన మూడీస్‌

Thursday 14th November 2019
news_main1573725368.png-29593

  విదేశీ రేటింగ్‌ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌, 2019కి గాను ఇండియాపై తన జీడీపీ వృద్ధి రేటు అంచనాలను  5.6 శాతానికి గురువారం తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగ రంగంలోని మందగమనంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడం లేదని ఈ బ్రోకరేజి తెలిపింది. ‘ఇండియా జీడీపీ వృద్ధి రేటును సవరిస్తున్నాం. గతేడాది 7.4 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 5.6 శాతానికి తగ్గుతుందని అంచనావేస్తున్నాం’ అని మూడీస్‌ పేర్కొంది. ‘ఇండియాలో ఆర్థిక మందగమనం ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగుతోంది’ అని అభిప్రాయపడింది.
    మూడీస్‌ అక్టోబర్‌ 10న ఆర్థిక సంవత్సరం 2019-20కి గాను దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 5.8 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఈ వృద్ధి రేటును 6.2 శాతంగా అంచనావేసింది.  కాగా ఈ రేటింగ్‌ ఏజెన్సీ గత వారంలో ఇండియాపై దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి తగ్గించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో పాటు, ఉద్యోగ కల్పన నెమ్మదించడం వంటి అంశాల వలన ఆర్థిక మందగమనం,  వినియోగరంగంలో కూడా విస్తరించిందని అక్టోబర్‌లో మూడీస్‌ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ఫలితంగా దేశ వృద్ధి రేటును ఆర్థిక సంవత్సరం 2020కి గాను 6.6 శాతంగా, ఆర్థిక సంవత్సరం 21కి గాను 6.7 శాతంగా అంచనావేస్తున్నామని ఈ విదేశీ రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. ‘దేశీ ఆర్థిక వృద్ధి 2018 మధ్య నుంచి పడిపోవడం ప్రారంభించింది. గతేడాది సుమారుగా 8 శాతంగా నమోదైన దేశీయ జీడీపీ, ఈ ఏడాది ద్వితియ త్రైమాసికం నాటికి 5 శాతానికి పడిపోయింది. నిరుద్యోగం పెరగడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. అయినప్పటికి బలమైన వినియోగ మద్ధతుగా ఉండడంతో ఆర్థిక వ్యవస్థ కొంత కోలుకోగలిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులలో వినియోగం డిమాండ్‌ కూడా భారీగా పడిపోవడాన్ని గమనించవచ్చు’ అని మూడీస్‌ పేర్కొంది. 
    వ్యవస్థలోని మందగమనాన్ని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది. కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలపై ట్యాక్స్‌ను 15 శాతానికి తగ్గించింది. దీంతో పన్నురేట్ల పరంగా ఇతర ఆసియా దేశాలతో సమానంగా ఇండియా చేరుకోగలిగింది. పన్నురేట్లను తగ్గించడంతోపాటు, బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చడం, 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులగా మార్చడం, ఆటోసెక్టార్‌కు మద్దతు ఇవ్వడం, మౌలిక రంగంలో ఖర్చు చేయడానికి ప్రణాళికలు వేస్తుండడం, స్టార్ట్‌అప్‌ కంపెనీలకు పన్ను ప్రయోజనాలను అందించడం వంటి అనేక విధానాలను ప్రభుత్వం ‍ ప్రకటించింది. ‘అయినప్పటికి ఇందులో ఏ చర్య కూడా విస్తృతంగా విస్తరించిన వినియోగ డిమాండ్‌ మందగమనంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపదు’ అని మూడీస్‌ తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ ఏడాది దూకుడుగా వడ్డీ రేట్లను తగ్గించిందని, ఇంకా తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. ‘ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతోపాటు, చమురు ధరులు తగ్గడం, అంతర్జాతీయ సానుకూలతల వలన కేంద్ర బ్యాంకు మరికొన్ని ద్రవ్యపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికి ఎన్‌బీఫ్‌సీ రంగంలో విస్తరించిన రుణ సంబంధిత సమస్యల వలన ఈ రేట్ల కోత బదిలీ ఆలస్యమవుతోంది’ అని అభిప్రాయపడింది. తక్కువ ఉద్యోగ వృద్ధి రేటు వినియోగంపై ప్రభావం చూపుతుంది. వడ్డీరేట్ల కోత సైకిల్‌ తగినంత వేగంగా బదిలీ కావడం లేదు. ఫలితంగా కంపెనీలు తీసుకున్న రుణాలపై అధికంగా వడ్డీని చెల్లించవలసి వస్తోంది’ అని మూడీస్‌ పేర్కొంది. You may be interested

మూడేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Thursday 14th November 2019

దేశీయ హోల్‌సేల్‌ ద్యవ్యోల్బణం(డబ్ల్యూపీఐ, టోకు ద్రవ్యోల్బణం)  అక్టోబర్‌ నెలలో స్వల్పంగా తగ్గి 0.16 శాతంగా నమోదైంది. ఈ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలో 0.33 శాతంగా ఉంది. ఆహర పదార్దాల ధరలు పెరగడంతో డబ్యూపీఐ ఇండెక్స్‌ నెగిటివ్‌ జోన్‌లోకి వెళ్లలేదని విశ్లేషకులు తెలిపారు. కాగా అక్టోబర్‌ నెల డబ్యూపీఐ ద్రవ్యోల్బణం గత మూడేళ్లలో కనిష్ఠం కావడం గమనార్హం. తయారీరంగ వస్తువుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌ నెలలో -0.84 శాతంగా నమోదైంది. ఇది సెప్టెంబర్‌

ఫలితాల ఎఫెక్ట్‌:ముత్తూట్‌ ఫైనాన్స్‌ 10శాతం అప్‌

Thursday 14th November 2019

రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో ముత్తూట్‌ షేరు 10శాతం లాభపడింది. కంపెనీ నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం 77 శాతం ఎగసి రూ. 900 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 41 శాతం బలపడి రూ. 1047 కోట్లను తాకింది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,467  కోట్లకు

Most from this category