News


మరోసారి భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత

Tuesday 10th March 2020
news_main1583811896.png-32377

  • 2020లో 5.3 శాతంగా ఉంటుందని అంచనా

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను 2020 సంవత్సరానికి గతంలో వేసిన 5.4 శాతం నుంచి 5.3 శాతానికి మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సవరించింది. కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లో వినియోగ డిమాండ్‌ క్షీణిస్తుందన్న అంచనాలతో ఈ నిర్ణయానికి వచ్చింది. మార్చి నెలకు సంబంధించి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తన అంచనాలను మూడీస్‌ తాజాగా విడుదల చేసింది. చైనా వెలుపల కరోనా వైరస్‌ వేగంగా మరిన్ని ప్రధాన దేశాలకు విస్తరించిందని పేర్కొంది. వైరస్‌ను స్థిరంగా నియంత్రణలోకి తీసుకొచ్చినా కానీ, 2020లో రెండో త్రైమాసికంలో అంతర్జాతీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉండొచ్చన్న అంచనాను వెలువరించింది. అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో పర్యాటక ఆంక్షలు ఏప్రిల్‌-జూన్‌ వరకు కొనసాగొచ్చని పేర్కొంది. సరఫరాలకు విఘాతంతోపాటు, వినియోగం, పెట్టుబడులు కూడా క్షీణిస్తాయని, చమురు ధరలు, ఇతర కమోడిటీల ధరలు జూన్‌ వరకు ప్రస్తుత స్థాయిల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది.
సవరించిన అంచనాలు

  • జీ20 ఆర్థిక వ్యవస్థలు 2.1 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. గత అంచనాల కంటే 0.3 శాతం తక్కువ.  
  • 2020 సంవత్సరానికి చైనా వృద్ధి అంచనాలు 5.2 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గింపు.
  • అమెరికా వృద్ధి రేటు 1.7 శాతం నుంచి 1.5 శాతానికి పరిమితం
  • కరోనా వైరస్‌ ఎక్కువ కాలం పాటు కొనసాగితే, చమురు ధరలు బ్యారెల్‌ 40-50 డాలర్లకే పరిమితం అయితే, అటువంటి పరిస్థితుల్లో భారత వృద్ధి రేటు 2020లో 5 శాతానికి పరిమితం కావచ్చు. చైనా వృద్ధి రేటు 3.7 శాతానికి తగ్గొచ్చు. 



You may be interested

17 నెలల కనిష్టానికి రూపాయి

Tuesday 10th March 2020

30 పైసలు క్షీణత 74.17 వద్ద క్లోజింగ్ కరోనాతో మందగమన భయాలు కారణం ముంబై: కరోనావైరస్‌ ప్రభావంతో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో దేశీ కరెన్సీ సోమవారం ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 30 పైసలు తగ్గి 74.17 వద్ద క్లోజయ్యింది. చమురు ధరలు భారీగా పతనం కావడం కూడా ఇందుకు దారి తీసినట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. సోమవారం ఇంటర్‌బ్యా్ంక్‌ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి

యస్‌ బ్యాంక్‌ స్కామ్‌పై సీబీ'ఐ'

Tuesday 10th March 2020

ఏడు ప్రాంతాల్లో సోదాలు 5 సంస్థలు, ఏడుగురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ జాబితాలో రాణాకపూర్‌ భార్య, కుమార్తెలు కూడా నిందితులపై లుక్‌ అవుట్‌ నోటీసులు సీఈవో గిల్‌ను ప్రశ్నించిన ఈడీ న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ నుంచి యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ కుటుంబానికి రూ. 600 కోట్లు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలకు సంబంధించి సోమవారం 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

Most from this category