News


ఇండియా వృద్ధి అంచనాలు తగ్గించిన మూడీస్‌

Thursday 10th October 2019
news_main1570701116.png-28805

మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ సంస్థ తాజాగా భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించింది. 2019-20 సంవత్సరానికి జీడీపీ అంచనాను 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడుల ఆధారిత మందగమనం విస్తతృం కావడం, ఇది క్రమంగా వినిమయ మందగమనానికి దారితీయడం, తత్ఫలితంగా గ్రామీణ కుటుంబాల్లో ఆర్థిక ఒత్తిళ్లు పెరగడం, బలహీనమైన ఉపాధి కల్పన జరగడం వంటి కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నట్లు వివరించింది. మందగమనానికి కారణాలు అనేకమని, ముఖ్యంగా దేశీయ కారణాలున్నాయని, ఇవి దీర్ఘకాలం ప్రభావం చూపుతాయని రేటింగ్‌ ఏజన్సీ వ్యాఖ్యానించింది. 2020-21 సంవత్సరంలో వృద్ధి పుంజుకొని 6.6 శాతానికి పెరగవచ్చని, తదుపరి క్రమంగా 7 శాతం వరకు చేరవచ్చని మూడీస్‌ అంచనా వేసింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో క్రెడిట్‌ సంక్షోభంతో మందగమన సమస్య పెరిగిందని, రిటైల్‌ లోన్లలో అధికశాతం వీటి ద్వారానే జరుగుతాయని తెలిపింది. ఇటీవలే క్యు1లో జీడీపీ 5 శాతమని ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాను ఆర్‌బీఐ 6.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ఇలాంటి అల్పవృద్ధి ఎక్కువకాలం ఉంటే ప్రభుత్వ విత్త పరిస్థితి దెబ్బతింటుందని మూడీస్‌ హెచ్చరించింది. ఇటీవల ప్రకటించిన కార్పొరేట్‌ పన్నుల తగ్గింపుతో ప్రభుత్వ లోటు జీడీపీలో 3.7 శాతానిఇక పెరగవచ్చని అంచనా వేసింది. ఇదే నిజమైతే ప్రభుత్వ లక్ష్యం నుంచి లోటు 0.4 శాతం పెరిగినట్లవుతుంది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ ఫండ్‌ భారీగా కొన్న షేర్లివే..!

Thursday 10th October 2019

   దేశీయ అతి పెద్ద ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, గత నెల మార్కెట్‌ భారీ ర్యాలీ తర్వాత పీఎస్‌యూ, బ్యాంకింగ్‌, ఇన్ఫ్రా తదితర రంగాలలోని స్టాకులను కొనుగోలు చేసింది. ఈ కంపెనీ సెప్టెంబర్‌ నెలలో కోటి చొప్పున ఎస్‌బీఐ(స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), ఎన్‌హెచ్‌పీసీ(నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పోరేషన్‌) షేర్లును కొనుగోలు చేసింది.  కాగా ఈ పీఎస్‌యూల షేర్ల విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి

నిప్టీ 75, సెన్సెక్స్‌ 240 పాయింట్లు పతనం!

Thursday 10th October 2019

  యుఎస్‌-చైనా మధ్య జరిగిన డిప్యూటీ స్థాయి చర్చలలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడంతో పాటు వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్‌ వచ్చిన చైనా ప్రతినిధులు షెడ్యుల్‌కి ముందే యుఎస్‌ను వీడనున్నారనే వార్తలు వెలువడడంతో గురువారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదేవిధంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కదులుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక సంవత్సరం 2020 రెండవ త్రైమాసికానికి సంబంధించి కార్పోరేట్‌ ఫలితాల ఒత్తిడి, బ్యాంకింగ్‌ షేర్లు

Most from this category