News


చినుకు పడకపోతే చిక్కులే!

Thursday 13th June 2019
news_main1560422511.png-26274

(SAKSHI BUSINESS EXCLUSIVE)

థాంప్సన్‌ టీవీ ఇండియా సీఈఓ అవనీత్‌ సింగ్‌
న్యూఢిల్లీ, సాక్షి బిజినెస్‌: ఈ ఏడాది రుతుపవనాలు సరిగా వర్షించకపోతే అన్ని రంగాలకు గడ్డుకాలం వస్తుందని ఎస్‌పీపీఎల్‌ సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వా హెచ్చరించారు. ఎకానమీ, ముఖ్యంగా రూరల్‌ ఎకానమీ మందగమన కోరల్లో ఉందని, సరైన వర్షపాతమే ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తుందని చెప్పారు. స్వాతంత్రానంతరం ఇన్నేళ్లు గడిచినా, రుతుపవనాల కోసం ఎదురుచూడాల్సి రావడం బాధాకరమని, నదుల అనుసంధానమే ఇందుకు తగిన మందని చెప్పారు. వానలు సరిగా లేకపోవడంతో అన్ని రంగాల్లో విక్రయాలు మందగించాయన్నారు. టీవీల విక్రయాలు సైతం బాగా తగ్గాయని చెప్పారు. అందుకే తాము ఆఫ్‌లైన్‌ కన్నా ఆన్‌లైన్‌ విక్రయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఈ విధానం సత్ఫలితాలు ఇస్తోందని, తమ ఉత్పత్తుల విక్రయాలు స్థిరంగా ఉన్నాయని చెప్పారు. దేశీయంగా ఏటా 1.25 కోట్ల టీవీలు అమ్ముడుపోతున్నాయని, ఇందులో తమ వాటా దాదాపు 4 శాతమని వివరించారు. 2025 నాటికి ఈ వాటాను 10 శాతానికి పెంచుకుంటామన్నారు. ఇటీవలే నోయిడాలో ఉత్పత్తిప్లాంట్‌ రెండో లైన్‌ ఆరంభించామన్నారు.
ట్రేడ్‌వార్‌ను ఉపయోగించుకోవాలి
దేశీయంగా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్లకు విదేశాలకు విస్తరించడంపై పెద్దగా ఆసక్తి, అనుభవం లేదని సింగ్‌ చెప్పారు. మనది ఎగుమతుల ఆధారిత మార్కెట్‌ కాదన్నారు. అందుకే చైనాతో ఎగుమతుల విషయంలో పోటీ పడలేకపోతున్నామని చెప్పారు. నిజానికి ఇప్పుడు ట్రేడ్‌ ఉద్రిక్తతలు తలెత్తిన వేళ మనకు అనేక అవకాశాలు ఓపెన్‌ అవుతున్నాయని, కానీ మనం ఉపయోగించుకోలేకపోతున్నామని తెలిపారు. నిజంగా మనం ఎగుమతులపై దృష్టి సారిస్తే చైనాను దాటేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జీఎస్‌టీ దీర్ఘకాలంలో మేలు చేసే నిర్ణయమని, కానీ ఇప్పుడున్న స్లాబులు టీవీ పరిశ్రమను కుంగదీస్తున్నాయని తెలిపారు. బడ్జెట్లో టీవీలను 18 శాతం స్లాబులోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. You may be interested

కనిష్టస్థాయిల నుంచి రికవరీ

Thursday 13th June 2019

మిడ్‌సెషన్‌ కొనుగోళ్లతో సూచీలు కనిష్టస్థాయి నుంచి రికవరీ సాధించి  గురువారాన్ని మిశ్రమంగా ముగించాయి. సెన్సెక్స్‌ 15 పాయింట్ల నష్టంతో 39,741.36 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 11,914.05 వద్ద ముగిసింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ నేడు మార్కెట్‌ నష్టాలతో మొదలైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌,  చైనాతో వాణిజ్య వివాద పరిష్కారంపై ట్రంప్‌ నిరుత్సాహకరంగా స్పందించడంతో అమెరికా, ఆసియా మార్కెట్లు నేలచూపులకు పరిమితంకావడంతో

13 శాతం నష్టపోయిన యస్‌ బ్యాంక్‌

Thursday 13th June 2019

యస్‌ బ్యాంక్‌ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 12.96 శాతం నష్టపోయింది. ఫారిన్‌ బ్రోకరేజి సంస్థ యూబీఎస్‌ ఈ షేరు టార్గట్‌ విలువను రూ.170 నుంచి రూ.90 కి తగ్గించింది.    టార్గెట్‌ ధరను 47శాతం మేర తగ్గించడంతో  షేరు గురువారం నాలుగు సంవత్సరాల కనిష్ఠ స్థాయికిపడిపోయింది.   2015 అగష్ట్టు 24 తర్వాత యస్‌బ్యాంకుకు ఇదే కనిష్ఠ స్థాయి. యూబీఎస్‌ ప్రకారం ఈ రేటు నుంచి కూడా 20

Most from this category