News


మూడింటిపై కొత్త ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌

Friday 24th May 2019
news_main1558693383.png-25919

జీఎస్‌టీ, పన్నులు, బ్యాంకులే కీలకం
నిపుణుల అంచనా
ఎన్‌డీఏ ప్రభుత్వం మరోమారు ఏర్పడనుంది. ఈ దఫా ఐదేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం పన్ను కోతలు, జీఎస్‌టీ పునర్‌వ్యవస్థీకరణ, బ్యాంకు సంస్కరణలపై ఎక్కువ శ్రద్ధ పెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   ఒకపక్క ఎకానమీ మందగిస్తోంది, డిమాండ్‌ క్షీణిస్తోంది, సాగు రంగం సంక్షోభంలో ఉంది, లిక్విడిటీ కొరత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తొలి వంద రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు ప్రకటిస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎకానమీలో ఉత్తేజం తెచ్చే ప్రణాలికలు సిద్ధంగా ఉన్నాయని బీజేపీ ప్రముఖులు చెబుతున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లు 2025 నాటికి ఇండియాను 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా ఎకానమీలో ఉత్సాహం తెచ్చే తక్షణ చర్యలు కొన్నింటిని చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. జూన్‌, జూలైలో వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం కీలక విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. డిమాండ్‌పెంచి, వినిమయాన్ని ఉరకలెత్తించేందుకు ప్రభుత్వం పన్ను కోతలను ప్రవేశపెట్టవచ్చని అంచనాలున్నాయి. దీంతో పాటు జూన్‌లో ఆర్‌బీఐ మరికొంత మేర వడ్డీరేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నారు. అదేవిధంగా జీఎస్‌టీని మరింత సరళీకృతం చేయడం, వీలైతే శ్లాబులు తగ్గించడం, జీఎస్‌టీ పన్నుదాఖలు సమయాన్ని తగ్గించడం వంటి చర్యలు కూడా ఉండే అవకాశాలున్నాయి. వీటితో పాటు పీఎస్‌యూ బ్యాంకులకు మరింత క్యాపిటల్‌ అందించడం, జలాన్‌ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. 
బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు...
- బీజేపీ మ్యానిఫెస్టో బట్టి చూస్తే పన్నులు, బ్యాంకులు, జీఎస్‌టీ అనే మూడు అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండొచ్చని ఎస్‌కేపీ బిజినెస్‌కన్సల్టింగ్‌ అభిప్రాయపడింది. ఇందుకోసం ప్రభుత్వం ఇండస్ట్రీ స్టేక్‌ హోల్డర్స్‌తో చర్చలు జరపవచ్చని పేర్కొంది. 
- బోఫాఎంఎల్‌ సైతం ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులు నిధులతో పీఎస్‌బీలను రీక్యాప్‌ చేయవచ్చని అంచనా వేసింది. 
- గత ప్రభుత్వ హయం చివరలో పార్లమెంట్‌లో పెండింగ్‌ పడిపోయిన కీలకమైన వేతన బిల్లులాంటివి వెంటనే ఆమోదించే అవకాశాలున్నాయని యూబీఎస్‌ పేర్కొంది. దీంతో పాటు లేబర్‌కోడ్‌ కూడా ఆమోదం పొందవచ్చని తెలిపింది. 
- ఉన్న చట్టాలను సరళీకరించి, ప్రజలకు సులభంగా చేరువయ్యే యత్నాలుంటాయని క్రెడిట్‌ సూసీ అంచనా వేసింది. 
- గ్రామీణ వినిమయాన్ని పెంచడం, ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ కొరతను తీర్చడం, పారిశ్రామికాభివృద్ధి సాధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. ఎకానమీలో వడ్డీరేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని, వీటిని తగ్గించే యత్నాలుంటాయని తెలిపింది. 
- ఎకానమీని ఉత్తేజపరిచేందుకు అవసరమైన విత్త, ద్రవ్య ఉద్దీపనలు ప్రకటించే ఛాన్సులున్నాయని ఎడెల్‌వీజ్‌ అభిప్రాయపడింది. 
- ఎన్‌డీఏ రెండో విడతలో వృద్ధి ఉద్దీపన కీలకాంశం కానుందని, ఇందుకోసం గ్రామీణ వినిమయ ఉద్దీపన విధానాలు, ఇన్‌ఫ్రా వ్యయాలు పెంచడం, పన్ను సరళీకరణలు, సామాజిక పెట్టుబడులు(హౌసింగ్‌ తదితరాలు) చేపట్టవచ్చని నోమురా అంచనా వేసింది. You may be interested

నిపుణులు మెచ్చిన 9 స్టాక్స్‌!

Friday 24th May 2019

కొత్త ప్రభుత్వ హయంలో పీఎస్‌బీ, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్‌, రోడ్డు మరియు నిర్మాణ రంగాలు మంచి జోరు చూపుతాయని ఎకనమిక్‌ టైమ్స్‌ నిపుణుల బృందం అభిప్రాయపడింది. కీలకమైన ఈ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెడుతుందని తెలిపింది. ఎఫ్‌ఎంసీజీల్లో గ్రామీణ వినిమయంపై ఫోకస్‌ పెట్టిన కంపెనీలకు మరింత లబ్ది ఉంటుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం 30వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి పచ్చజండా ఊపింది. 2014తో పోలిస్తే ఇది దాదాపు

అటో షేర్ల జోరు

Friday 24th May 2019

మార్కెట్లో అటో షేర్లు లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌లో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 3శాతం ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌ 8,269.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభంను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అశోక్‌ లేలాండ్‌, అపోలో టైర్‌, టాటామోటర్స్‌, మదర్ససన్‌ సుమి, ఎంఅండ్‌ఎం, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ 3.15శాతం(260 పాయింట్లు) పెరిగి 8,475.70 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని

Most from this category