News


ఆరు నెలల క్షీణతకు తెర!

Saturday 14th March 2020
news_main1584158840.png-32474

  • ఫిబ్రవరి ఎగుమతుల్లో 2.91 శాతం వృద్ధి
  • దిగుమతులూ వృద్ధిబాటలోకి... 
  • వాణిజ్యలోటు 9.85 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు ఆరు నెలల తర్వాత ఫిబ్రవరిలో 2.91 శాతం స్వల్ప వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. అంటే 2019 ఫిబ్రవరితో పోల్చితే 2020 ఫిబ్రవరిలో ఎగుమతులు 2.91 శాతం పెరిగాయన్నమాట. విలువ రూపంలో 27.65 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, ఇంజనీరింగ్‌, కెమికల్స్‌ వంటి రంగాల ఎగుమతుల్లో వృద్ధి నమోదుకావడం దీనికి కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. 

దిగుమతుల్లో 2.48 శాతం వృద్ధి
ఇక గడచిన ఎనిమిది నెలలుగా క్షీణతలో ఉన్న భారత్‌ ఎగుమతులూ వృద్ధిబాటలోకి వచ్చాయి. ఫిబ్రవరిలో 2.48 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. విలువ రూపంలో ఈ మొత్తం 37.50 బిలియన్‌ డాలర్లు. వెరసి ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు ఫిబ్రవరిలో 9.85 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన 12 నెలలుగా ఇంత తక్కువ వాణిజ్యలోటు ఇదే తొలిసారి. 

కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

  •  ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు 8.5 శాతం పడిపోయి 2.36 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
  • సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, ఆయిల్‌ సీడ్స్‌, సముద్ర ఉత్పత్తులు, ముడి ఇనుము, ఔషధాలు, తివాచీ, హస్త కళల ఉత్పత్తుల ఎగుమతులు సానుకూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. 
  • ఎలక్రా‍్టనిక్‌ గూడ్స్‌ ఎగుమతులు 37 శాతం పెరిగాయి. రసాయనాల ఎగుమతులు 16 శాతం ఎగశాయి. 
  • చమురు దిగుమతులు 14.26 శాతం పెరిగి 10.76 బిలియన్‌ డాలర్లుగా నమోదయితే, చమురు యేతర దిగుమతులు 1.6 శాతం ఎగసి 26.74 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకూ....
ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకూ చూస్తే, ఎగుమతులు 1.5 శాతం క్షీణతతో 292.91 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులూ 7.30 శాతం పడిపోయి 436 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 143.12 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

సేవల రంగం ఇలా...
ఇదిలావుండగా, జనవరిలో సేవల రంగం ఎగుమతులు 19 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  సేవల దిగుమతుల విలువ 12 బిలియన్‌ డాలర్లు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ గణాంకాలను విడుదల చేసింది. 



You may be interested

భారత్‌ నుంచి రెట్టింపు కొనుగోళ్లు: బోయింగ్‌

Saturday 14th March 2020

త్వరలో 2 బిలియన్‌ డాలర్లకు సోర్సింగ్‌ బోయింగ్‌ వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత సరఫరాదారుల నుంచి కొనుగోళ్లను మరికొన్నాళ్లలో 2 బిలియన్‌ డాలర్లకు పెంచుకోనున్నట్లు విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌ కమర్షియల్‌ ఎయిర్‌ప్లేన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డరెన్‌ హస్ట్‌ తెలిపారు. ప్రస్తుతం ఇది ఏటా 1 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. భారత్‌లోని 200 మంది పైగా సరఫరాదారులు బోయింగ్‌కు చెందిన అత్యాధునిక ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నారని

వాణిజ్య రియల్టీ మీద కరోనా ప్రభావం

Saturday 14th March 2020

ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లావాదేవీల వాయిదా తగ్గిన సైట్‌ విజిట్స్‌; పెట్టుబడుల్లోనూ పునరాలోచన సాక్షి, హైదరాబాద్‌: దేశీయ వాణిజ్య స్థిరాస్తి రంగానికి కరోనా వైరస్‌ సోకింది. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో బహుళ జాతి కంపెనీలు సైట్‌ విజిట్స్‌ తగ్గించేశాయి. తుది దశకు చేరుకున్న లావాదేవీలను, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లతో పాటూ హెచ్‌ఎన్‌ఐ, ఎన్నారైలూ రియల్టీ పెట్టుబడులకు పునరాలోచనలో పడ్డారు. సింపుల్‌గా చెప్పాలంటే 2019లో రికార్డ్‌ స్థాయిలో జరిగిన కమర్షియల్‌ స్పేస్‌

Most from this category