News


భారత్‌లోకి మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌

Wednesday 15th January 2020
news_main1579060837.png-30941

  • ఏప్రిల్‌లో ఈక్యూసీ ఎస్‌యూవీ విడుదల

పూనే: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌.. భారత లగ్జరీ ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌ ‘ఈక్యూ’ని మంగళవారం ఇక్కడ ప్రారంభించింది. నూతన బ్రాండ్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఈక్యూసీ’ పేరిట తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలకానుందని సంస్థ ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌కు సంబంధించిన అన్ని వాహనాలను ఇదే బ్రాండ్‌ నుంచి విడుదలచేయనున్నామని చెప్పారు. 



You may be interested

అమ్మకాలదే పైచేయి- నష్టాలతో షురూ

Wednesday 15th January 2020

సెన్సెక్స్‌ 190 పాయింట్లు డౌన్‌ అన్ని రంగాలూ వెనకడుగు ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ ఎదురీత వరుసగా రెండు రోజులపాటు సరికొత్త గరిష్టాలను అందుకుంటూ సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లకు బుధవారం చుక్కెదురైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 41,762ను తాకగా.. నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,299 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి నేడు ప్రాథమిక డీల్‌ కుదరనున్న నేపథ్యంలో

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం రూ.1,300 కోట్లు

Wednesday 15th January 2020

32 శాతం వృద్ధి  రూ.9,074 కోట్లకు మొత్తం ఆదాయం  క్షీణించిన రుణ నాణ్యత  (అప్‌డేటెడ్‌...) న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.1,300 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.985 కోట్లు)తో పోల్చితే 32 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.7,232 కోట్ల నుంచి రూ.9,074 కోట్లకు పెరిగిందని వివరించింది. కేటాయింపులు అధికంగా ఉన్నా,

Most from this category