News


ఎకానమీ కన్నా ముందే మార్కెట్లో రికవరీ!

Friday 6th September 2019
news_main1567763309.png-28241

తుషార్‌ ప్రధాన్‌ 
నిజ ప్రపంచానికి సంబంధించి జరగబోయే అంశాలను స్టాక్‌ మార్కెట్లు కాస్త ముందుగానే గ్రహించి అందుకు తగ్గట్లే ప్రవర్తిస్తుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. స్టాక్‌ మార్కెట్లు ఆయా అంశాలను డిస్కౌంట్‌ చేసేదాన్ని బట్టి సదరు అంశం పాజిటివ్‌గా ఉండొచ్చా? నెగిటివ్‌గా ఉండొచ్చా? అనేది చాలామార్లు గుర్తించవచ్చు. అందుకే స్టాక్‌మార్కెట్లను లీడింగ్‌ ఇండికేటర్లు అంటుంటారు. ఇందుకు తగ్గట్లే ఈ సారి కూడా ఎకానమీ కన్నా ముందే మార్కెట్లలో రికవరీ వస్తుందని హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ ఏఎం ఇండియా సీఐఓ తుషార్‌ ప్రధాన్‌ చెబుతున్నారు. మార్కెట్లు వార్తల ఆధారంగా కదలాడుతుంటాయి. ఈ దఫా ఎకనమిక్‌ సైకిల్స్‌ నెమ్మదిగా కదలడం వల్ల ప్రస్తుతం మార్కెట్‌ ఎటు కదులుతుందో చెప్పలేమని, కానీ రికవరీ మాత్రం ఎకానమీ కన్నా ముందే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే మనం దాదాపు 9 నెలలుగా మందగమనం చూస్తున్నామని, ఇది మరింతగా కొనసాగుతుందా? లేదా? అనేది మార్కెట్లో వచ్చే రికవరీ వెల్లడిస్తుందన్నారు. మార్కెట్‌ రికవరీ ముఖ్యంగా కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ఎర్నింగ్స్‌ వృద్ధి, ప్రోత్సాహకాల ప్రకటనలు, మౌలిక అంశాలు మెరుగుపడడం(లిక్విడిటీ పెరగడం, వడ్డీరేట్లు తగ్గడం తదితరాలు) మార్కెట్‌ రికవరీని ప్రభావితం చేస్తాయన్నారు. ప్రస్తుతం లిక్విడిటీ మెరుగైందని, రేట్లు తగ్యాని చెప్పారు. మౌలికాంశాలు పాజిటివ్‌గా మారుతున్నందున మార్కెట్లు మరింత కాలం నెగిటివ్‌గా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎకానమీలో రికవరీకి సమయం పట్టినా, మార్కెట్‌ రికవరీకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అంచనా వేశారు. ఎకానమీలో రికవరీకి మార్కెట్‌ ఇచ్చినంత స్పష్టమైన సంకేతం ఇంకేదీ ఇవ్వదన్నారు.
ఈ మందగమనం కామనే..
 ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి వృద్ధిలో ఇలాంటి మందగమనాలు సాధారణమేనన్నారు. ఇవి స్వల్పకాలికమేనన్నారు. దేశ ఎకానమీ చూస్తే ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం మరీ అంత ఎక్కువ ప్రభావితం కామని, తిరిగి ఇండియా వృద్ధి పట్టాలు ఎక్కుతుందని తెలిపారు. ఇంత సైజున్న ఎకానమీకి 6 శాతం వృద్ధి కూడా గొప్పదేనన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయం సంక్లిష్టంగా ఉందని, దేశీయ పరిస్థితి మందగమనంలో ఉందని, అందువల్ల కొంత ఓపిక వహించి, కాస్త పరుగుల సూచనలు కనబడే ముందు పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఒకేమారు పెద్ద మొత్తాలు పెట్టుబడిగా పెట్టకుండా ముందు కొంత కొంత మొత్తాలతో ఆరంభించి పరిస్థితులపై స్పష్టత వచ్చాక అప్పుడు పెట్టుబడుల్లో వేగం పెంచాలని సూచించారు.


‘‘ క్రికెట్‌ భాషలో చెప్పాలంటే ప్రస్తుతం ఫ్రంట్‌ఫుట్‌ వేసి ఆట ఆరంభించవచ్చు, కానీ తొలుత కొన్ని డిఫెన్సివ్‌ స్ట్రోక్స్‌ ఆడాలి, అనంతరమే షాట్స్‌ జోలికి వెళ్లాలి.’’- తుషార్‌ ప్రధాన్‌.You may be interested

సెన్సెక్స్‌ లాభం 337 పాయింట్లు

Friday 6th September 2019

నిఫ్టీ 10950 సమీపంలో ముగింపు రాణించిన అటో, మెటల్‌, ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్లు సూచీలు వారాంతాన్ని లాభాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 337 పాయింట్ల లాభంతో 36,981.77 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93.10 పాయింట్లు పెరిగి 10,941.00 వద్ద ముగిసింది. అటో, మెటల్‌, ఆర్థిక, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. అక్టోబర్‌ నుంచి అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య తాజాగా వాణిజ్య చర్చలు పునఃప్రారంభం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 1శాతం వరకు

మారుతి 4శాతం ర్యాలీ

Friday 6th September 2019

రెండు రోజుల వరుస పతనం అనంతరం మారుతి సుజుకీ ఇండియా శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.6000.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టయోటా సుషో ఇండియా కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌పై మాతృ సంస్థ టయోటా సుషో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌లకు ఉమ్మడి నియంత్రణకు యూరోపియన్ కమిషన్ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ సానుకూల వార్తలతో

Most from this category