News


ఇకపై ప్రకటించేది భూ, కార్మిక సంస్కరణలేనా?

Thursday 7th November 2019
news_main1573118238.png-29417

మార్కెట్‌ వర్గాల అంచనాలు
ఇటీవల కాలంలో మందగిస్తూపోతున్న ఎకానమీని పునరుజ్జీవింపజేసేందుకు ప్రభుత్వం పలు రకాల సంస్కరణలు ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా కుదేలైన గృహనిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు బడా ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఆర్థిక వృద్ధి ఈ చర్యలే సరిపోవని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దేశ వృద్ధి రేటు ఇటీవల కాలంలో బాగా తగ్గుతూ వస్తోంది. ఆర్‌బీఐ సైతం తన తాజా వృద్ధి అంచనాలను తగ్గించింది. ఐఎంఎఫ్‌ లాంటి సంస్థలు కూడా ఇదే భావనలో ఉన్నాయి. అందువల్ల ఎకానమీలో రికవరీకి ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. పన్నురేట్ల తగ్గింపు, గృహనిర్మాణ రంగానికి నిధుల్లాంటి సంస్కరణల తర్వాత భూ, కార్మిక సంస్కరణలు తీసుకువస్తేనే మేలని అభిప్రాయపడుతున్నారు.

పరిశ్రమలు భూసమీకరణ సులభంగా చేసుకునేలా సవరణలు తీసుకురాకుంటే, పన్ను సంస్కరణలు ప్రకటించి ప్రయోజనం ఉండదని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వ్యవస్థాపకుడు సౌరవ్‌ ముఖర్జీ చెప్పారు. అందువల్ల ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌ సీజన్‌ కల్లా భూసంస్కరణలు ప్రకటించవచ్చని అంచనా వేసారు. దేశీయంగా ఉపాధికల్పన పెంచాలంటే కార్మిక సంస్కరణలు కూడా తప్పనిసరని ఆయన అన్నారు. అయితే 1971 నుంచి వీటిని సవరించేందుకు ఏ ‍ప్రభుత్వం సాహసం చేయలేదని గుర్తు చేశారు. కానీ వీటిని అమలు చేస్తేనే ఉపాధి మెరుగుపడుతుందన్నారు. వీటితో పాటు వ్యక్తిగత ఆదాయపన్ను విషయంలో కూడా కొన్ని తగ్గింపులు ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఏఎస్‌కే గ్రూప్‌ డైరెక్టర్‌ భరత్‌షా తదితర నిపుణులు కూడా ఈ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు. భూ, కార్మిక తదితర కొన్ని రంగాల్లో సంస్కరణలు చాలా ఏళ్లుగా రాలేదని, ప్రస్తుతం వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. తమకు బలమైన మెజార్టీ వచ్చినందున కీలకమైన సంస్కరణలను ధైర్యంగా అమలు చేస్తామని ఇటీవల ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం తప్పక భూ, కార్మిక సంస్కరణల్లాంటి ముఖ్యమైన వాటిని తీసుకువస్తుందని ఎక్కువమంది భావిస్తున్నారు. You may be interested

పడి లేచిన ఈక్విటీ మార్కెట్లు

Thursday 7th November 2019

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒత్తిళ్లు సరళతరమవ్వడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం సెషన్లో ఇంట్రాడే కనిష్ఠాల నుంచి తిరిగి కోలుకున్నాయి. అయినప్పటికి ట్రేడ్‌వార్‌కు సంబంధించిన ప్రతి వార్తను గుడ్డిగా నమ్మొద్దని విశ్లేషకులు సలహాయిస్తున్నారు.  కాగా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించుకున్న సుంకాలను తిరిగి వెనక్కి తీసుకునేందుకు యుఎస్‌-చైనా అంగీకరించాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఈ వార్త వెలువడిన తర్వాత, ఇంట్రాడే కనిష్ఠాలను

బీమా రంగ షేర్లకు భలే గిరాకీ

Thursday 7th November 2019

రానున్న రోజుల్లో బీమా రంగ షేర్లకు మంచి డిమాండ్‌ ఉంటుందని ప్రముఖ అనలిస్ట్‌ గౌరవ్‌ గార్గ్‌ అభిప్రాయపడ్డారు. దేశీయంగా బీమా అత్యంత ఆశాజనక రంగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా దేశీయ ఎక్చ్సేంజీల్లో ఇతర సూచీలు, రంగాల కంటే బీమా రంగ సూచి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో జీవిత బీమా షేర్లు ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున ఆదాయాలను సమకూర్చాయి.  ఊహించని, నష్టాన్ని కలిగించే సంఘటనలో భద్రతను అందిస్తున్న కారణంగా

Most from this category