News


ఆర్‌బీఐకి దూరదృష్టి లేదు!

Friday 6th December 2019
news_main1575605195.png-30086

మార్క్‌ మొబియస్‌ విమర్శ
ఎకానమీలో రేట్ల తగ్గింపు అవసరం ఎంతో ఉందని, ఆర్‌బీఐ ఈ దఫా కూడా రేట్లను తగ్గించి ఉండాల్సిందని ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌మొబియస్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ రేట్లను యథాతధంగా కొనసాగించాలనుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ మరీ హ్రస్వదృష్టితో ఆలోచించిందని, దూరదృష్టి లోపించిందని విమర్శించారు. భారత్‌పై తమ పాజిటివ్‌ ధృక్పథం కొనసాగిస్తామన్నారు. 2020లో భారత్‌ మంచి ప్రదర్శన చూపుతుందన్నారు. భవిష్యత్‌లో దేశీయ వ్యయాల్లో టెలికం కీలకం కానుందని ఆయన చెప్పారు. విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీరేట్ల యథాతథ పరిస్థితికి మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) 5.15 శాతం, రివర్స్‌ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీ) 4.90 శాతాన్ని అలాగే కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోవడంతో (ఆరేళ్ల కనిష్ట స్థాయి) ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్‌బీఐ కనీసం పావు శాతం వరకు రెపో రేటును తగ్గిస్తుందని విశ్లేషకులు, నిపుణులు ఊహించారు. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడం, రానున్న కాలంలో మరింతగా  పెరిగే అవకాశాలుండటం రేట్ల కోతకు వెళ్లకుండా అడ్డుపడ్డాయి. అంతేకాదు, తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5.1 శాతానికి తగ్గించేసింది.



You may be interested

లాభాల  ప్రారంభం

Friday 6th December 2019

 క్రితం రోజు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం వెలువడిన తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనైన స్టాక్‌ సూచీలు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 172 పాయింట్ల లాభంతో 40,952 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్ల పెరుగుదలతో 12,047 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

జీఎస్‌టీ పరిధిలోకి ఏటీఎఫ్‌, గ్యాస్‌

Friday 6th December 2019

2020-21 బడ్జెట్లో ప్రతిపాదన..! న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), సహజ వాయువులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకుని వచ్చే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఈ రెండు కమోడిటీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న బహుళ పన్నుల భారాన్ని తగ్గించి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రానున్న 2020-21 బడ్జెట్లో వీటిని జీఎస్‌టీలో భాగం చేసే

Most from this category