News


పరిశ్రమలు.. కకావికలం!

Saturday 12th October 2019
news_main1570853600.png-28836

- ఆగస్టులో ఉత్పాదకత 1.1 శాతం క్షీణత
- ఏడేళ్లలో అత్యంత ఘోరమైన పనితీరు
- క్యాపిటల్‌ గూడ్స్‌,  కన్జూమర్‌ డ్యూరబుల్స్ భారీ పతనం
- తయారీ, విద్యుత్‌, మైనింగ్‌ అన్నీ పేలవమే...

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదుచేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఐఐపీ -1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత తాజా సమీక్షా నెల (2019 ఆగస్టు)లో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను రంగాల వారీగా చూస్తే...
 - తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్‌ ఉన్న ఈ విభాగంలో  అసలు వృద్ధి నమోదుకాలేదు. -1.2 శాతం క్షీణత నెలకొంది. ఈ కీలక విభాగంలో ఇలాంటి ఫలితం చూడ్డం ఐదేళ్ల తరువాత (2014 అక్టోబర్‌లో -1.8 శాతం క్షీణత) తొలిసారి. 2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదుచేసుకున్నాయి. 
- విద్యుత్‌: ఈ రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా -0.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 
- మైనింగ్‌: ఈ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది. 
- క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, డిమాండ్‌లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా -21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది. 
- కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా -9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది. 
- ఇన్‌ఫ్రా/నిర్మాణం: పేలవ పనితనాన్ని ప్రదర్శించిన రంగాల్లో ఇది ఒకటి. ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు  -4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది. 
- కన్జూమర్‌ నాన్‌-డ్యూరబుల్స్‌: సబ్సులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. 

ఐదు నెలల్లోనూ డౌన్‌
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్‌- ఆగస్టు మధ్య 2.4 శాతంగా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతం. 
రెండవ త్రైమాసికంపై నీలినీడలు...
మొదటి (ఏప్రిల్‌-జూన్‌) త్రైమాసికంలో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి పడిపోయింది. రెండవ త్రైమాసికంలో వృద్ధి భారీగా మెరుగుపడకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ, డిమాండ్‌లో పురోగతి ఉందా? లేదా? అన్న అంశం పండుగల సీజన్‌లో వినియోగం, వ్యవసాయ రంగం పురోగతి వంటి అంశాలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. 
- అదితి నయ్యర్‌, ఆర్థికవేత్తYou may be interested

ఎస్‌ఏపీకి సీఈవో మెక్‌డెర్మాట్‌ గుడ్‌బై

Saturday 12th October 2019

- నూతన సీఈవోగా జెన్నిఫర్‌మోర్గాన్‌ బెర్లిన్‌: జర్మనీకి చెందిన వ్యాపార సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ‘ఎస్‌ఏపీ’కి దశాబ్ద కాలం పాటు సీఈవోగా పనిచేసిన అమెరిన్‌ వ్యాపారవేత్త బిల్‌ మెక్‌ డెర్మాట్‌ శుక్రవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. తన పదవీ కాలాన్ని పొడిగించుకోకూడదని మెక్‌డెర్మాట్‌ నిర్ణయించుకున్నారని, తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఎస్‌ఏపీ ప్రకటించింది. బోర్డు సభ్యురాలు జెన్నిఫర్‌ మోర్గాన్‌ను సీఈవోగా, మరో సభ్యుడు క్రిస్టియన్‌ క్లీన్‌ను సహ సీఈవోగా నియమిస్తున్నట్టు ఎస్‌ఏపీ

ఫోర్బ్స్ కుబేరుడు మళ్లీ అంబానీయే

Saturday 12th October 2019

- వరుసగా 12వ ఏడాది దేశంలో నంబర్‌ వన్  - 51.4 బిలియన్ డాలర్ల సంపద న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడిగా వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా 12వ ఏడాదీ అగ్రస్థానంలో నిల్చారు. టెలికం వెంచర్ జియో కార్యకలాపాలు గణనీయంగా విస్తరించిన నేపథ్యంలో ఆయన సంపద మరో 4.1 బిలియన్ డాలర్లు పెరిగి 51.4 బిలియన్ డాలర్లకు చేరింది. 2019కి సంబంధించి ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ఈ

Most from this category