News


లాక్‌డౌన్‌ మూల్యం రూ.9 లక్షల కోట్లు

Thursday 26th March 2020
news_main1585193218.png-32681

  • జీడీపీలో 4 శాతం మేర ప్రభావం
  • 2020-21 వృద్ధి 3.5 శాతం: బార్‌క్లేస్‌

ముంబై: కోవిడ్‌ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. వైరస్‌ విస్తరించకుండా నివారణ చర్యల్లో భాగంగా మూడు వారాల పాటు దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ (మూసివేత)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 120 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9లక్షల కోట్లు) మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. ఇది భారత జీడీపీలో 4 శాతానికి సమానమని పేర్కొంది. మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల నష్టమే 90 బిలియన్‌ డాలర్లు ఉంటుందని, దీనికి అంతకుముందే పలు రాష్ట్రాల్లో లౌక్‌డౌన్‌ ప్రభావం అదనమని వివరించింది. కాగా, దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ నిర్ణయం బుధవారం ఈక్విటీ మార్కెట్లను ఏ మాత్రం ప్రభావితం చేయకపోవడం గమనార్హం. 


వృద్ధికి దెబ్బ...
అలాగే, 2020-21 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను 1.7 శాతం మేర తగ్గించి 3.5 శాతంగా ఉంటుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో బార్‌క్లేస్‌ పేర్కొంది.  


వడ్డీ రేట్లకు భారీగా కోత 
ఆర్‌బీఐ ఏప్రిల్‌ 3న తన విధాన ప్రకటనను విడుదల చేయనుంది. ఆ సందర్భంగా కీలక రేట్లను 0.65 శాతం తగ్గించే అవకాశాలున్నాయని, ఈ ఏడాది మిగిలిన కాలంలో మరో ఒక శాతం వరకు రేట్లను తగ్గించొచ్చని తెలిపింది.  ద్రవ్యలోటు కూడా లక్ష్యాన్ని దాటిపోతుందని బార్‌క్లేస్‌ పేర్కొంది. ద్రవ్యలోటు 5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. 


ఆర్థిక చర్యల్లేవు...
ఇతర దేశాలతో పోలిస్తే ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యలను బ్రోకరేజీ సంస్థ ఎడెల్‌వీజ్‌ అభినందిస్తూనే.. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు లోపించాయని పేర్కొంది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా పడే ప్రభావం విషయమై కేంద్ర సర్కారు మౌనం దాల్చినట్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే డీమోనిటైజేషన్‌, జీఎస్‌టీ నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగాన్ని కోవిడ్‌ మహమ్మారి మరింత అగాధంలోకి నెట్టేసినట్టయిందని పేర్కొంది. మానిటరీ పరంగా ఎన్నో చర్యలు అవసరమని సూచించింది. 



You may be interested

టెల్కోలకు లాక్‌ డౌన్ కష్టాలు..!

Thursday 26th March 2020

భారీగా పెరిగిన డేటా ట్రాఫిక్‌ నెట్‌వర్క్‌పై అదనపు భారం నెట్ స్పీడ్ తగ్గకుండా  చూసేందుకు టెల్కోల చర్యలు న్యూఢిల్లీ: కరోనా వైరస్ భయాల కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఓవైపు కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తుండటం, మరోవైపు ఇంటి పట్టునే ఉండాల్సి రావడంతో ప్రజలు కాలక్షేపం కోసం ఎక్కువగా ఇంటర్నెట్‌నే వినియోగిస్తుండటంతో డేటా వినియోగం భారీగా పెరిగిపోతోంది. నెట్‌వర్క్‌లపై

బ్యాంకుల పనివేళలు మారాయి..

Wednesday 25th March 2020

కరోనా వైరస్‌ నివారణ చర్యలు, లౌక్‌డౌన్‌ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వాటి వేళ్లలో మార్పులు చేశాయి. లౌక్‌డౌన్‌ తొలగిపోయే తక్కువ సిబ్బందితో, తక్కువ సమయం పాటు సేవలు అందించనున్నాయి. బ్యాంకు శాఖలకు రాకుండా ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకులు కస్టమర్లను సూచిస్తున్నాయి. చెల్లింపులు, నగదు బదిలీ లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్‌లు వంటివి మినహా ఇతర బ్యాంకింగ్‌ సేవలు కూడా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకు ఉద్యోగుల

Most from this category