News


జీఎస్‌టీ రేట్‌కట్‌కు అవకాశాలు తక్కువే!

Wednesday 19th June 2019
news_main1560939876.png-26422

డెల్లాయిట్‌ ఇండియా ప్రతినిధి ఎంఎస్‌ మణి అంచనా
ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్‌టీ రేట్‌ కట్‌కు అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని డెల్లాయిట్‌ ఇండియా(పరోక్ష పన్నుల విభాగం) ప్రతినిధి ఎంఎస్‌ మణి అభిప్రాయపడ్డారు. గతేడాది కాలంలో జీఎస్‌టీ వసూళ్లు ప్రభుత్వ అంచనాల కన్నా తక్కువగా ఉంటున్నాయని, కేవలం గత మూడు నెలల్లో మాత్రమే ఈ వసూళ్లు స్థిరంగా ఉంటున్నాయని చెప్పారు. ప్రస్తుత నెలకు లక్ష కోట్ల రూపాయల వసూళ్లు ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో ఆశించినదానికన్నా తక్కువన్నారు. ఇకపై జీఎస్‌టీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా వసూళ్లు తగ్గకుండా చూడాల్సిఉంటుందన్నారు. అందువల్ల ఇప్పట్లో జీఎస్‌టీ రేట్ల తగ్గింపును ప్రభుత్వం పరిగణించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. నిజానికి గతంలోని వ్యాట్‌, ఎక్సైజ్‌ సుంకాలతో పోలిస్తే ప్రస్తుత జీఎస్‌టీ రేట్లు సమానంగా లేదా తక్కువగా ఉన్నాయన్నారు. ఈ సమయంలో వసూళ్లను పరిశీలిస్తే ఇంకా రేట్లను తగ్గించడం కుదరదన్నారు. జీఎస్‌టీ ప్రధాన ఉద్దేశం పన్ను విస్తృతి పెంచడం, అనేక టాక్సులను ఏకీకృతం చేయడం, నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించడమని చెప్పారు. ఈ ఉద్దేశాలు పాక్షికంగానే నెరవేరాయని, జీఎస్‌టీ అమలు ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇందుకు కారణమని చెప్పారు. తర్వాత దశల్లో జీఎస్‌టీకి పలు సవరణలు చేసుకుంటూ వచ్చామన్నారు. అందువల్ల క్రమంగా జీఎస్‌టీ వల్ల వచ్చిన సమస్యలు తొలగిపోతున్నాయని చెప్పారు. సరిగ్గా టాక్సులు కట్టేవాళ్లకు సులభంగా, సరిగా కట్టనివాళ్లను గుర్తించి విచారించేలా ఈ వ్యవస్థలో మరికొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
అది మంచి మార్గం కాదు
డిమాండ్‌ను పెంచేందుకు, ధరలు తగ్గించేందుకు పన్ను రేట్లను తగ్గించడం మంచి విధానం కాదని మణి చెప్పారు. కొన్ని ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గించినా అది ఎంతవరకు డిమాండ్‌ను ఉత్తేజపరుస్తుందో అంచనా వేయలేమన్నారు. వస్తువు ధరలో పన్నులు చాలా స్వల్ప భాగం వహిస్తాయన్నారు. ఒక రంగంలో మందగమనానికి కారణమైన నిర్మాణాత్మక అంశాలను గుర్తించాలని చెప్పారు. పన్ను రేట్లను తగ్గిస్తే పన్ను వసూళ్లు తగ్గుతాయని, అందువల్ల ఈ మార్గాన్ని ఎంచుకోకూడదని తెలిపారు. పన్ను రేట్ల తగ్గింపునకు, డిమాండ్‌ విస్తరించడానికి మధ్య చాలా సమయం పడుతుందని గత అనుభవాలు చెబుతున్నాయని వివరించారు. అసలే గతేడాది జీఎస్‌టీ వసూళ్లు అంచనాలను అందుకోలేదని, ఈ సమయంలో రేట్లను తగ్గిస్తే తట్టుకోగలమా? లేదా? అని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాలని సూచించారు. You may be interested

స్విగ్గీలో కార్లైల్‌ గ్రూప్‌ పెట్టుబడులు!

Wednesday 19th June 2019

అమెరికా కంపెనీ కార్లైల్‌, స్విగ్గీలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతోంది. స్విగ్గీలో కార్లైల్‌ గ్రూప్‌ 20 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్విగ్గీలో ఇన్వెస్ట్‌ చేస్తే కార్లైల్‌కు ఇది ఇండియాలో రెండో పెట్టుబడి కానుంది. బెంగుళూరు కంపెనీ డెలివరీలో కార్లైల్‌ 2017లో పెట్టుబడులు పెట్టింది. స్విగ్గీ 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను గత ఏడాది డిసెంబర్‌లో సాధించింది. స్విగ్గీలో పెట్టుబడి దారుగా ఉన్న నస్పర్స్‌ లిమిటెడ్‌ నాయకత్వంలో

టాటాపవర్‌ షేర్లను అప్‌గ్రేడ్‌ చేసిన సిటి బ్రోకరేజ్‌

Wednesday 19th June 2019

సిటి బ్రోకరేజ్‌ సంస్థ టాటా గ్రూప్‌నకు చెందిన టాటా పవర్‌ కంపెనీ షేర్ల రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. త్వరలోనే నాన్‌ కోర్‌ ఆస్తుల విభజన ప్రక్రియ, మరో 3- 6నెలల్లో ముంద్రా అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్ట్‌ రిసెల్యూషన్‌ ప్రారంభం కానుండటం టాటా పవర్‌ కంపెనీకి కలిసొచ్చే అంశాలని బ్రోకరేజ్‌ తెలిపింది. గతంలో తాము ఈ కంపెనీ షేర్లకు కేటాయించిన ‘‘న్యూట్రల్‌’’ రేటింగ్‌ను ‘‘బై’’రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేస్తుండంతో పాటు షేరు

Most from this category