News


పీఎంసీ వ్యవహారం కళ్లు తెరిపించేది...

Tuesday 1st October 2019
news_main1569896967.png-28639

  • కేంద్ర సహాయ మంత్రి అనురాగ్‌ఠాకూర్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు సంక్షోభం కళ్లు తెరిపించేదిగా అభివర్ణించారు కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌. ఆడిటర్ల వైఫ్యలం సహా పలు అంశాలను ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. పీఎంసీ బ్యాంకులో నిబంధనల ఉల్లంఘన, అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకుపై ఆర్‌బీఐ ఆరు నెలల పాటు ఆంక్షలు పెట్టిన విషయం విదితమే. ‘‘నియంత్రణ సంస్థల పాత్ర ఎంతో కీలకం. అదే సమయంలో ఆడిటర్లు, డైరెక్టర్లు, బ్యాంకు అధికారుల పాత్ర కూడా అంతే స్థాయిలో ముఖ్యమైనది అవుతుంది. గత కొన్నేళ్లుగా వారందరూ ఏం చేస్తున్నట్టు. ఇందుకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ ఈ అంశంపైనే దృష్టి సారించిందని భావిస్తున్నా’’ అని ఠాకూర్‌ అన్నారు. పీఎంసీకి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు షాక్‌కు గురిచేసే విధంగా ఉన్నాయని, బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి ఇవి ఎంతో కీలకం, కనువిప్పు కలిగించేవిగా పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా మంత్రి మాట్లాడారు. 2024-25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి దేశ ఆర్థిక వ్యవస్థ చేరుకునేందుకు బ్యాంకింగ్‌ రంగం కీలక పాత్ర పోషించనున్నట్టు పేర్కొన్నారు. పీఎన్‌బీ 125 ఏ‍ళ్ల చరిత్రను తెలిపే మ్యూజియంను ఆయన ప్రారంభించారు. 



You may be interested

మార్కెట్లోకి మారుతీ మినీ ఎస్‌యూవీ

Tuesday 1st October 2019

నాలుగు వేరియంట్లలో మారుతీ ఎస్‌-ప్రెస్సో ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్‌లో  మైలేజీ 21.7 కిమీ.  న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ మినీ ఎస్‌యూవీ(స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికల్‌), ఎస్‌-ప్రెస్సోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మినీ ఎస్‌యూవీ ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్‌(ఎక్స్‌ షోరూమ్‌ ధరలు)లో ఉన్నాయి. స్డాండర్డ్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లు, ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతోంది. రెనో క్విడ్‌, డాట్సన్‌ రెడీ-గో,

రుణ భారం తగ్గించుకుంటాం !

Tuesday 1st October 2019

గ్రూప్‌ కంపెనీల ఏజీఎమ్‌ల్లో అనిల్‌ అంబానీ  ముంబై: దేశంలో అగ్రశ్రేణి ఐదు రక్షణ కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ను నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అనిల్‌ ధీరుబాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం రిలయన్స్‌ ఇన్‌ఫ్రా రుణభారం రూ.6,000 కోట్లుగా ఉందని, దీనిని తగ్గించుకోనున్నామని సోమవారం ఇక్కడ జరిగిన కంపెనీ ఏజీఎమ్‌లో ఆయన పేర్కొన్నారు. ఇతర గ్రూప్‌ కంపెనీలు-రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌,

Most from this category