News


ఆర్థిక మంత్రిగా కెవీ కామత్‌..?

Saturday 18th January 2020
news_main1579345185.png-31022

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగం నిపుణులు, ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, బ్రిక్స్‌ బ్యాంక్‌ ప్రస్తుత చైర్మన్‌  కెవీ కామత్‌ కేంద్రమంత్రి మండలిలోకి రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కామత్‌కు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిత్వ శాఖను ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా కామత్‌ గతంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ చైర్మన్‌గానే గాక ఇన్ఫోసిస్‌, ఇండియా ఇంక్‌ నెట్‌వర్క్‌లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగంలో అపార అనుభవం ఉన్న కామత్‌ను కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రాజ్యసభ సభ్యుడు స్వపన్‌దాస్‌గుప్తాను  మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో జూనియర్‌ మంత్రిగా చేర్చుకునే అవకాశాలున్నాయి. ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని సెంట్రల్‌ యూనివర్శిటీల్లో ఉద్రిక్త వాతావరణాలు నెలకొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరేగాక నీతీ ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ను మంత్రి మండలిలోకి తీసుకుని సమర్థవంతమైన టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో  వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే మంత్రిత్వ శాఖలలో పనిచేసిన సురేష్‌ ప్రభు వంటివారు మళ్లీ మోదీ మంత్రిమండలిలోకి వచ్చే అవకాశం లేకపోలేదని విశ్వసనీయ సమాచారం. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 33 శాతం జంప్‌

Saturday 18th January 2020

ప్రస్తుత ఆర్థిక సంవతర్సం మూడో త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు విశ్లేషకుల  అంచనాలను మించిన నమోదయ్యాయి. ఈ క్యూ3లో బ్యాంకు రూ.7,416.48 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ3లో సాధించిన రూ.5,585.85 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 32.77 శాతం అధికం. ఇతర ఆదాయం 35.52శాతం వృద్ధి చెంది రూ.6,669.28 కోట్లను సాధించింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం 12.69శాతం పెరిగి రూ.14,172.90కోట్లకి చేరింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆస్తుల

ఇది ప్రీబడ్జెట్‌ ర్యాలీ ; నాయర్‌

Saturday 18th January 2020

ప్రభుత్వ చర్యలు, కంపెనీల ఆర్జనలపై అంచనాల ఎఫెక్ట్‌ వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట ప్రీబడ్జెట్‌ ర్యాలీ నెలకొన్నట్లు మార్కెట్‌ నిపుణులు వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. మందగమనం‍లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దన్ను, పారిశ్రామిక రంగానికి మద్దతు, వినియోగాన్ని పెంచే గ్రామీణ ఆదాయాల పెంపు తదితర చర్యలను 2020 బడ్జెట్‌లో మార్కెట్లు ఆశిస్తున్నట్లు తెలియజేశారు. జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌

Most from this category