News


2020లో మార్కెట్‌ను ప్రభావితం చేసే రాజకీయ అంశాలివే!

Wednesday 1st January 2020
news_main1577857086.png-30582

గతేడాది ఎన్‌డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో మరోమారు ఎన్నికవడం అతిపెద్ద రాజకీయ విశేషం. 2020లో ఈ విధంగా మార్కెట్‌పై ప్రభావం చూపే వివిధ రాజకీయ అంశాలు ఇలా ఉన్నాయి...
- ఢిల్లీ ఎన్నికలు: ఇప్పటికింకా ఎన్నికల కమీషన్‌ ఢిల్లీ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం బిజీబిజీగా ప్రచారంలో మునిగిపోయాయి. ఈ దఫా పోటీ ప్రధానంగా ఆప్‌, బీజేపీ మధ్యనే ఉండొచ్చు. కాంగ్రెస్‌ కొన్ని చోట్ల ప్రభావం చూపవచ్చు. బీజేపీ గత ఎన్నికల్లో ఢిల్లీలో అన్ని ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ ఊపుతో అసెంబ్లీలో కూడా పాగా వేయాలని యత్నిస్తోంది. 
- బీహార్‌ ఎన్నికలు: కొత్త ఏడాది చివర్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇప్పటికే అక్కడ రాజకీయ వేడి ఆరంభమైంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ అంతంతమాత్రపు ప్రదర్శన చూపింది. దీంతో ఈసారి మరిన్ని సీట్లు తీసుకోవాలని జేడీ యూ ఆలోచిస్తోంది. మరోవైపు జేడీయూలో చేరిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల కాలంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి కొనసాగుతుందా? లేక త్రిముఖ పోటీ ఉంటుందా? అనేది కీలకంగా మారనుంది.
- రాజ్యసభ నెంబర్లు: లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ ఉన్నా, రాజ్యసభలో మాత్రం ఇప్పటికీ మెజార్టీ లేదు. కేవలం మిత్రపక్షాలు, కొన్ని తటస్థ పక్షాల ఆధారంతో పెద్దల సభలో బీజేపీ కీలకబిల్లులను గట్టెక్కించుకుంటోంది. అయితే 2014తో పోలిస్తే బీజేపీకి ఈ సభలో సీట్లు పెరిగాయి. ఈ ఏడాది రాజ్యసభలో 73 సీట్లకు నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి, జూన్‌, జూలై, నవంబర్‌లో ఏపీ, అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హర్యానా, హెచ్‌పీ, జార్కండ్‌, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్‌ఱ, మేఘాలయ్‌, మిజోరం, ఒడిషా, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్‌, యూపీ, బెంగాల్‌రాష్ట్రాల నుంచి ఈ ఏడాది కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది. 
- ఇంకా...?: జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిక జరగాల్సిఉంది. అయితే డీలిమిటేషన్‌ పూర్తయ్యాకే ఇది జరగవచ్చు. ఇందుకు మరింత సమయం పడుతుందని అంచనా. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరీ రాష్ట్రాల్లో ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి హడావుడి ఆరంభమవుతుంది. అసోంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చని(సీఏఏ కారణంగా) ఊహాగానాలున్నాయి. వీటన్నింటికీ కొత్త ఏడాదిలో సమాధానం దొరుకుతుంది. ఈ పరిణామాలన్నీ 2020లో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయగలవని నిపుణులు భావిస్తున్నారు. You may be interested

రానున్న 6 నెలల్లో నాణ్యమైన షేర్లదే హవా

Wednesday 1st January 2020

ఆటో రంగ కౌంటర్లు వెలుగులో నిలిచే చాన్స్‌ క్యాపిటల్‌ గూడ్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలపై దృష్టి మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ్‌ ఖేమ్కా రానున్న ఆరు నెలల కాలంలో అత్యంత నాణ్యమైన, అధిక విలువ కలిగిన కౌంటర్లకే డిమాండ్‌ కొనసాగనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ్‌ ఖేమ్కా తాజాగా అంచనా వేశారు. ఆటో విభాగంలో మారుతీ వంటి పెద్ద కంపెనీలు స్వల్ప వృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్ల చానల్‌కు

లాభాల్లో అదానీ గ్రీన్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌

Wednesday 1st January 2020

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది సెలవుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరింత బలపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బ్యాంక్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపించడంతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 107 పాయింట్లు పెరిగి 41,360కు చేరింది. నిఫ్టీ సైతం 31 పాయింట్లు పుంజుకుని 12,200 వద్ద ట్రేడవుతోంది. కాగా.. వార్తల ఆధారంగా ఓవైపు అదానీ గ్రీన్‌ ఎనర్జీ,

Most from this category