News


నేడే జలాన్‌ ప్యానెల్‌ నివేదిక!

Monday 24th June 2019
news_main1561361887.png-26530

ఆర్‌బీఐ మిగులు నిధులను క్రేంద్రానికి బదిలీ చేసేలా సిఫార్సులుంటాయని అంచనా
ఆర్‌బీఐ మిగులు నిధుల వినియోగానికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటైన జలాల్‌ ప్యానెల్‌ సోమవారం నివేదిక సమర్పించనుంది. ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు మిగులు నిధులను(సుమారు లక్ష నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు) కేంద్రానికి ఇచ్చేందుకు ప్యానెల్‌ పచ్చజండా ఊపవచ్చని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిధులతో పీఎస్‌యూ బ్యాంకులను రీక్యాప్‌ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ విధంగా పంచడం వల్ల దేశ సావరిన్‌ రేటింగ్‌కు ఎలాంటి రిస్కు ఉండదని బ్రోకింగ్‌సంస్థలు భావిస్తున్నాయి. పైగా ఇలాంటి సిఫార్సు వస్తే మార్కెట్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.

ప్యానెల్‌ నివేదికపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి..
- యూబీఎస్‌: మిగులునిధులతో ప్రభుత్వం పీఎస్‌యూబ్యాంకులకు మూలధన సాయం చేయగలదు. దీనివల్ల పీఎస్‌బీలు క్రెడిట్‌సైకిల్‌ను సమర్ధవంతంగా నిర్వహించుకోగలుగుతాయి. ఒకేసారి 3000 కోట్ల డాలర్లను అందిచడం కన్నా ఏడాదికి వెయ్యికోట్ల డాలర్ల చొప్పున అందించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇదే జరిగితే బ్యాంకుల లోన్‌గ్రోత్‌ మరో 5- 7 శాతంపెరుగుతుంది. బ్యాంకుల ఎర్నింగ్స్‌ అంచనాల్లో 10- 15 శాతం మెరుగుదల ఉంటుంది. వెయ్యికోట్ల డాలర్ల రీక్యాప్‌తో వ్యవస్థలో దాదాపు 10000 కోట్ల డాలర్ల క్రెడిట్‌ లభ్యతకు అవకాశం ఉంటుంది. 
- హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: దేశీయ సావరిన్‌ రేటింగ్‌ మన వద్ద ఉన్న ఫారెక్స్‌ నిల్వల ఆధారంగా ఉంటుంది కానీ ఆర్‌బీఐ మిగులు నిధులను ప్రభుత్వానికి ఇవ్వడం మీద ఆధారపడి ఉండదు. అందువల్ల ఆర్‌బీఐ 3 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చినా, రేటింగ్‌లో మార్పులుండవు. నిజానికి ఈ చర్య దీర్ఘకాలంలో రేటింగ్‌ మెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ నిధులను పీఎస్‌బీల రీక్యాప్‌కు ఉపయోగిస్తే సదరు బ్యాంకుల పనితీరు బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా పీఎన్‌బీ, ఐఓబీ, యూకో, సెంట్రల్‌బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకులు ఈ చర్యతో బాగా లాభపడతాయి. 
- జేఎం ఫైనాన్షియల్స్‌: అనుక్నుట్లు నిధుల బదిలీ జరిగితే ప్రభుత్వం విత్తలోటును అధిగమించడంతో పాటు ఎకానమీలో ఉత్తేజాన్నిచ్చేచర్యలు చేపట్టడానికి వీలు చిక్కుతుంది. ఆర్‌బీఐ వద్ద ఉన్న కంటింజన్సీ నిధులు దాదాపు 9.2 లక్షల కోట్ల రూపాయలుంటాయని అంచనా. ఆర్‌బీఐ మొత్తం బాలెన్స్‌ షీట్‌లో ఇది 25 శాతం వాటా. ప్రపంచంలో ఇతర కేంద్ర బ్యాంకుల్లాగా ఈ మొత్తాన్ని 14 శాతానికి తగ్గిస్తే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విడుదలైతాయి. ఈ మొత్తాన్ని ఎలా బదిలీ చేస్తారన్న విషయమై స్పష్టత లేదు. 

 You may be interested

గ్లెన్‌మార్క్‌ షేర్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌..!

Monday 24th June 2019

6ఏళ్ల కనిష్టానికి పతమైన షేరు​ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ షేర్లకు యూఎఫ్‌ఎస్‌డీఏఏ షాక్‌ ఇచ్చింది. కంపెనీ ఇటీవల ఉపిరితిత్తుల వ్యాధి నివారణకు ర్యాల్ట్రిస్‌పై జనరిక్‌ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు యూస్‌ఎఫ్‌డీఏ అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకుంది. అయితే, ఔషధానికి సంబంధించిన యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్‌లో, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫ్యాకల్టీస్‌లో ఒక్కొక్క లోపాన్ని గుర్తించి కంప్లీట్‌ రెస్పాస్‌ లెటర్‌(సీఆర్‌ఎల్‌) జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ శుక్రవారం ఎక్స్చేంజీలకు సమాచారం

కళ తప్పిన మెటల్‌ షేర్లు

Monday 24th June 2019

మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు స్తబ్దుగా సాగుతాయి. మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మెటల్‌ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం వరకు నష్టపోయింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,932.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇండెక్స్‌ మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం క్షీణించి 2898.00ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది.

Most from this category