News


ఆర్‌బీఐ నిధుల బదిలీకి పచ్చజండా?!

Wednesday 17th July 2019
news_main1563359225.png-27131

పూర్తయిన జలాన్‌ ప్యానెల్‌ నివేదిక
ఆర్‌బీఐ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేయమని జలాన్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిమల్‌జలాన్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ నిధుల బదిలీపై చర్చించి బుధవారం తన తుది నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. మిగులు నిధులను 3-5 సంవత్సరాల కాలపరిమితిలో విడతలవారీగా కేంద్రానిక అందించాలని కమిటీ సిఫార్సు చేసిందని సదరు వర్గాలు తెలిపాయి. అయితే ఎంత మొత్తం బదిలీ చేసేది తెలియరాలేదు. ఈ మొత్తం 8వేల నుంచి 8,500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని గతంలో బ్లూమ్‌బర్గ్‌ అంచనా వేసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. ఆర్‌బీఐ సాయంతో ప్రభుత్వ విత్తలోటు ఆందోళనలు ఉపశమిస్తాయని అంచనా.

మిగులు నిధుల బదిలీతో పాటు రూ. 90వేల కోట్లను డివిడెండ్‌రూపంలో ఆర్‌బీఐ నుంచి పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి 68వేల కోట్ల రూపాయలు డివిడెండ్‌ రూపంలో అందింది. బుధవారం సమావేశంలో ఖరారు చేసిన నివేదికను తుది మార్పులు చేసిన అనంతరం ప్రభుత్వానికి సమర్పిస్తారు. నిధుల బదిలీ అంశమై కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తంఅయినట్లు తెలిసింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్‌లో 14 శాతం రిజర్వుల రూపంలో ఉంటాయి. ఆర్‌బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. ఈ రిజర్వుల పరిమితిని తగ్గించగా వచ్చే మిగులు నిధులను ప్రభుత్వం వాడుకోవాలని యోచిస్తోంది. గత గవర్నర్ల హయంలో ఈ అంశమై ఆర్‌బీఐ, కేంద్రప్రభుత్వాలకు మధ్య కొంత మేర ఘర్షణాపూరిత వాతావరణం ఏర్పడింది. గతంలో ఈ అంశంపై చర్చించేందుకు 1997లో సుబ్రమణ్యం కమిటీ, 2004లో ఉషా థోరత్‌ కమిటీ, 2013లో మాలేగామ్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ కూడా ఆర్‌బీఐ తన వద్ద 12- 18 శాతం వరకు రిజర్వులుంచుకొని మిగిలనవి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించాయి. 



You may be interested

మూడోరోజూ కొనసాగిన ర్యాలీ

Wednesday 17th July 2019

సెన్సెక్స్‌ లాభం 85 పాయింట్లు 25 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  మార్కెట్‌ ర్యాలీ మూడోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 85 పాయింట్లు పెరిగి 39,216 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,688 వద్ద స్థిరపడ్డాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన కోటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో పాటు పశ్చిమాసియా రాజకీయ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం మార్కె్‌ట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

తిరిగి రికార్డుస్థాయికి ఎస్‌బీఐ

Wednesday 17th July 2019

ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ షేర్లు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో తిరిగి జీవితకాల గరిష్టానికి చేరాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.364.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న మద్దతులో భాగంగా ఈ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 2.50 లాభపడి రూ.373.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఇది జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. కొద్దిరోజుల క్రితం  ఇదేస్థాయికి చేరిన తర్వాత స్వల్ప కరెక‌్షన్‌కు లోనైన

Most from this category