News


2008 రిపీటా? ఛాన్సేలేదు..

Friday 30th August 2019
news_main1567157525.png-28116

ఎకానమీ చాలా బలపడింది
మాంద్యాన్ని తట్టుకునే శక్తి ఉంది
నిపుణుల అంచనా
లాంగ్‌టర్మ్‌ పోర్టుఫోలియోలు నిర్మించుకోవాలని సూచన
వీలయినంత తొందరలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుందని దాదాపు ఇన్వెస్టర్లంతా మానసికంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతల పుణ్యమాని ఆరంభమైన మాంద్య భయాలు నానాటికీ విస్తరించాయి. దీంతో పలు మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మన ఈక్విటీలు సైతం ఇటీవలి కాలంలో బాగా నష్టాలు చవిచూశాయి. చాలా మంచి పోర్టుఫోలియోలు సైతం నెగిటివ్‌లోకి మారాయి. ఈ నేపథ్యంలో మాంద్యం వస్తే ఏం చేయాలని సగటు ఇన్వెస్టర్‌ బెదిరిపోతున్నాడు. గత దశాబ్దం చివరలో యూఎస్‌లో సబ్‌ప్రైమ్‌ సంక్షోభం కారణంగా ప్రపంచ మాంద్యం ఆరంభమైంది. ఆ సమయంలో ఒక్క నెలరోజుల్లో సెన్సెక్స్‌ నిఫ్టీలు దాదాపు సగానికి పైగా పతనమయ్యాయి. ఈ దఫా కూడా అలాంటి స్థితి వస్తుందని ఎక్కువమందిలో భయాలున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, అసలు 2008 సంక్షోభంతో ప్రస్తుత మాంద్యాన్ని పోల్చలేమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మాంద్య భయాలతో మార్కెట్లు పతనమైనా తిరిగి వేగంగా పైకివస్తాయని చెబుతున్నారు. మార్కెట్లలో భయాలు నివారించేందుకు ఇటీవల కేంద్ర ప్రకటించిన చర్యలు చాలా చిన్నవని, కానీ చాలా కీలకమైన సమయంలో వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. 
ఎంతో తేడా..
గత సంక్షోభానంతరం దేశీయ ఈక్విటీలు బాగా కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 2008తో పోలిస్తే దాదాపు 3 రెట్లు పెరిగింది. చాలా స్టాకులు మంచి రాబడులు అందించాయి. ఇప్పుడు ప్రపంచ ఎకానమీల్లో భారత్‌ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీల్లో ఒకటి కావడం వల్ల ఎలాంటి పతనం వచ్చినా మార్కెట్లు వెనువెంటనే కోలుకుంటాయని ఎక్కువమంది నిపుణుల అంచనా. గతంలో కూడా సంక్షోభ సమయ అనంతరం ఇతర మార్కెట్ల కన్నా భారత మార్కెట్టే వేగంగా కోలుకుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ తెలిపింది. ఇప్పుడు కనిపిస్తున్న మందగమన పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగవని, భారత ఎకానమీ మంచి వృద్ధికి తయారుగా ఉందని అంచనా వేసింది. లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులకు తయారయ్యేవాళ్లు ఇప్పుడు మంచి స్టాకులను ఎంచుకోవాలని సూచించింది. ప్రస్తుత మందగమనాన్ని 2008 సంక్షోభంతో కన్నా 2012 మందగమనంతో పోల్చుకోవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 2012లో మందగమన కారణంగా నిఫ్టీ 15 శాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 40 శాతం మేర పతనమయ్యాయి. కానీ 2014 మే నాటికి రెండు సూచీలు పూర్తిగా రికవరీ చెందాయి. ఆ తర్వాత నాలుగైదేళ్లు వార్షికంగా దాదాపు 25 శాతం వరకు రాబడులు అందించాయని యాక్సిస్‌ గుర్తు చేసింది. 


ప్రభావం ఉంటుంది.. కానీ!
అంతర్జాతీయ మందగమన ప్రభావం ఇండియాపై అసలు ఉండదని భావించకూడదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇతర ఎకానమీలతో పోలిస్తే రికవరీ ఇండియాలో ఎక్కువ వేగంగా ఉంటుందనేది వీరి భావన. దీనికితోడు ఇండియా మార్కెట్లు అధిక వాల్యూషన్ల వద్ద ఉన్నాయని సామ్‌కో సెక్యూరిటీస్‌ తెలిపింది. అందువల్ల మాంద్యం కారణంగా కొంత పతనం ఉండొచ్చని కానీ అనంతరం మాత్రం వేగవంతమైన పరుగు ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో ఇన్వెస్టింగ్‌ బెటరని, ట్రేడింగ్‌తో రిస్కులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. భారత అర్థిక వ్యవస్థ ఎక్కువగా దేశీయాంతర్గత ఆధారిత ఎకానమీ కావడం వల్ల అంతర్జాతీయ సంక్షోభ ప్రభావాలు తక్కువగా ఉండడమే కాకుండా అలాంటి నెగిటివిటీ నుంచి వేగంగా బయటపడుతుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా ప్రస్తుత ట్రేడ్‌వార్‌ కొన్ని రంగాలకు మేలు చేస్తుందని తెలిపారు. అందువల్ల 2008లో వచ్చినట్లు భారీ పతనాలు ఉండకపోవచ్చని, వచ్చే కరెక‌్షన్లను లాంగటర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశాలుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. మరింత సురక్షిత పెట్టుబడులు, రాబడుల కోసం సిప్‌లాంటి విధానాలు అనుసరించవచ్చని సలహా ఇచ్చారు. You may be interested

సెనెక్స్‌ లాభం 263 పాయింట్లు

Friday 30th August 2019

75 పాయింట్లు పెరిగిన నిఫ్టీ లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్ల మద్దతు చివరికి లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 263.86 లాభంతో 37,332.79 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,023.25 వద్ద ముగిసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫార్మా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 27,423.30 వద్ద

సెప్టెంబర్‌ చివరి నాటికి 74 స్థాయికి రూపాయి ..?

Friday 30th August 2019

అమెరికా చైనా మధ్య నిరంతరం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం, డాలర్‌ మారకంలో యువాన్‌ కరెన్సీ క్షీణత తదితర కారణాలతో ఈ సెప్టెంబర్‌ నాటికి రూపాయి విలువ 74స్థాయికి చేరుకుంటుందని వకార్ జావేద్ ఖాన్ అభిప్రాయపడ్డారు.  గతేడాది అక్టోబర్‌, డిసెంబర్‌  మధ్య కాలంలో రూపాయి దాదాపు 4శాతం బలపడింది. ఇదే కాలంలో అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు చల్లారడటంతో

Most from this category