News


రేటు కోత అంచనాలే అధికం

Tuesday 6th August 2019
news_main1565072930.png-27571

- ఇదే జరిగితే 5.5 శాతానికి రెపో
- ఆర్‌బీఐ ద్రవ్య పరపతి 
విధాన కమిటీ సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం సోమవారం నాడు ప్రారంభమైంది. మూడు రోజులు ఈ సమావేశం జరుగుతుంది.  ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన ప్రారంభమైన ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. 7వ తేదీన ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడుతుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే- రెపో. ప్రస్తుతం ఇది 5.75 శాతంగా ఉంది. అంచనాలకు అనుగుణంగా రెపోను పావుశాతం తగ్గిస్తే, ఇది 5.5 శాతానికి చేరుతుంది. వరుసగా నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో ఒకశాతం రేటు తగ్గించినట్లవుతుంది. 

‘కోత’ అంచనాలకు కారణాలు...
ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడం, పారిశ్రామిక రంగం నెమ్మదించడం, ఆర్థిక వృద్ధి పరుగుపై దీని ప్రభావం నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్‌ పెంపునకు రేటు తగ్గింపు వెసులుబాటు ఆర్‌బీఐకి కలుగుతోంది. కేం‍ద్రం కూడా రేటు తగ్గింపునే కోరుకుంటుండడం గమనార్హం. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ రాజ్‌కిరణ్‌ రాయ్‌ జీ రేటు పావుశాతం ఉండవచ్చని అంచనావేశారు. ‘‘ప్రస్తుతం వృద్ధి చోదకాలు అవసరం. రేటు తగ్గింపు ఖాయం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. పావుశాతం కోత ఉండవచ్చని సింగపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే గ్లోబల్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం- డీబీఎస్‌ తన తాజా నివేదికలో అంచనావేసింది. 

బదలాయింపూ వేగం కావాలి: పరిశ్రమ
రేటు తగ్గింపు ఒక్కటే కాదు. బ్యాంకులు కస్టమర్లకు ఆ ప్రయోజనాన్ని బదలాయించే చర్యలూ తీసుకోవాలని పరిశ్రమ కోరుతోంది.  జూన్‌ 6వ తేదీకి ముందు పాలసీ నిర్ణయం వరకూ చూస్తే, రెపో రేటు 50 బేసిస్‌ పాయింట్లు తగ్గింది (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 75 బేసిస్‌ పాయింట్లు). అయితే బ్యాంకర్లు మాత్రం ఇందులో కేవలం 21 బేసిస్‌ పాయింట్ల రేటును కస్టమర్లకు బదలాయించారు. 

సీఆర్‌ఆర్‌ కూడా తగ్గాలి: సీఐఐ
నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌)ని కూడా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించాలని సీఐఐ కోరుతోంది. ఇది వ్యవస్థలోకి రూ.60,000 కోట్లను తీసుకువస్తుందని పేర్కొంది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో​ కొంత​మొత్తాన్ని ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా నిల్వ చేయాల్సి ఉంటుంది. డిపాజిటల్‌ డిమాండ్‌ పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేయడమే దీని ఉద్దేశం. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. 

 You may be interested

రూ. 1,000 కోట్ల సమీకరణలో ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌

Tuesday 6th August 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ తాజాగా రూ. 1,000 కోట్ల దాకా నిధులు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ఇష్యూ ఆగస్టు 6న ప్రారంభమవుతుంది. ఐఐఎఫ్‌ఎల్‌ బాండ్లు గరిష్టంగా 10.5 శాతం దాకా వడ్డీ రేటు లభిస్తుంది. 15 నెలల నుంచి 69 నెలల దాకా కాలావధితో ఈ ఎన్‌సీడీలు ఉంటాయని సోమవారం ఇక్కడ జరిగిన విలేకరుల

వృద్ధి బాటపైకి సేవల రంగం: పీఎంఐ

Tuesday 6th August 2019

న్యూఢిల్లీ: భారత సేవల రంగం జూలైలో​తిరిగి వృద్ధి బాటపైకి వచ్చినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేర్కొంది. జూలైలో ఈ సూచీ 53.8 గా నమోదయ్యింది. జూన్‌లో ఈ సూచీ కేవలం 49.6 వద్ద ఉంది. పీఎంఐ ప్రకారం... సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. జూలై నెలలో పెరిగిన ఆర్డర్లు సేవల రంగాన్ని తిరిగి వృద్ధి

Most from this category