News


వృద్ధి బలహీనతే... రేటు కోతకు కారణం

Thursday 22nd August 2019
news_main1566446838.png-27935

- ఆగస్టు 7 విధాన ప్రకటనపై
ఆర్‌బీఐ మినిట్స్‌ విడుదల

ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు బలహీనత వల్లే ఆగస్టు 7 విధాన సమీక్ష సందర్భంగా 0.35 శాతం రేటు కోత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ఆగస్టు 7 పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనితో వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో ఆర్‌బీఐ 1.1 శాతం రెపోరేటు తగ్గించినట్లయ్యింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో 5.4 శాతానికి దిగివచ్చింది. ఇది తొమ్మిదేళ్ల కనిష్టస్థాయి. ఆగస్టు 7 పాలసీ ప్రకటనకు సంబంధించి ఆర్‌బీఐ బుధవారం మినిట్స్‌ను విడుదల చేసింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

  • సాధారణంగా పావుశాతం రెపోరేటు నిర్ణయమే జరుగుతుంటుంది. అయితే అసాధారణ రీతిలో 7వ తేదీన 0.35 శాతం కోత నిర్ణయం వచ్చింది. ఆర్‌బీఐ గవర్నర్‌సహా నలుగురు ఇందుకు ఓటుచేశారు.  ఇరువురు మాత్రం 25 బేసిస్‌ పాయింట్ల కోతకే మొగ్గు చూపారు. 
  • దేశీయ, అంతర్జాతీయ కారణాల వల్ల వృద్ధిరేటు మందగించింది. ఈ నేపథ్యంలో దేశీయ డిమాండ్‌ పెరగాలని, పెట్టుబడుల క్రియాశీలతకు మద్దతునివ్వాలని పరపతి ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. 
  • అంతక్రితం మూడు ద్వైమాసిక సమావేశాల్లో జరిగిన 0.75 శాతం రేటు అమలు వాస్తవరూపంలోకి ‍క్రమంగా వస్తోందని కూడా ఆర్‌బీఐ భావించింది. 
  • వచ్చే ఏడాది కాలంలో కూడా ద్రవ్యోల్బణం రేటు ప్రభుత్వ నిర్దేశిత ప్లస్‌ లేదా మైనస్‌ 2 శాతం వద్దే నిలకడగా ఉంటుందని గవర్నర్‌ సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేటు కోత, వృద్ధికి ప్రోత్సాహం ఆర్‌బీఐకి కీలకంగా ఉందని అన్నారు. 
  • కేంద్ర బ్యాంక్‌ నుంచి అదుతున్న రెపోరేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఇటీవల తరచూ బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. 



You may be interested

పెరిగిన టెల్కోల ఆదాయాలు

Thursday 22nd August 2019

 అయిదేళ్ల వ్యవధిపై ట్రాయ్ నివేదిక న్యూఢిల్లీ: గడిచిన అయిదేళ్లలో మొబైల్ డేటా చార్జీలు ఏకంగా 95 శాతం తగ్గాయి. జీబీకి రూ.11.78 స్థాయికి దిగివచ్చాయి. అయితే టెలికం ఆపరేటర్ల సంచిత ఆదాయం మాత్రం 2.5 రెట్లు పెరిగి రూ. 54,671 కోట్లకు చేరింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2014లో దేశీయంగా డేటా వినియోగం 828 మిలియన్ జీబీగా ఉండగా, 2018లో

వృద్ధి 5.7 శాతమే!: నోమురా

Thursday 22nd August 2019

ఏప్రిల్‌-జూన్‌పై అంచనా న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 5.7 శాతమే నమోదవుతుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ-  నోమురా అంచనావేసింది. వినియోగం పడిపోవడం, పెట్టుబడుల బలహీనత, సేవల రంగం పేలవంగా ఉండడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని సంస్థ అంచనావేసింది. మందగమన పరిస్థితులకు ఇక తొలగిపోతున్నట్లు సంకేతాలు అందుతున్నట్లు

Most from this category