News


ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం

Monday 22nd July 2019
news_main1563779204.png-27223

  • భారత్‌లో ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన ఏడీబీ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ద్రవ్యోల్బణం అంచనాలను ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. ముందుగా అంచనా వేసిన దానికన్నా 0.2 శాతం తక్కువగా 4.1 శాతం స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉండగలదని వివరించింది. రూపాయి బలపడటం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)అంచనాలు తగ్గడం తదితర అంశాలు ద్రవ్యోల్బణ తగ్గుదలకు కారణాలు కాగలవని ఏడీబీ తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో తక్కువ ద్రవ్యోల్బణం నమోదవడంలో భారత్‌ ప్రధాన చోదకంగా నిలుస్తుందని ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) 2019 అనుబంధ నివేదికలో ఏడీబీ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి ముందుగా భావించిన దానికన్నా 0.2 పర్సంటేజీ పాయింట్లు తక్కువగా 7 శాతానికి పరిమితం కాగలదని ఇందులో పేర్కొంది. 2019లో దక్షిణాసియా ద్రవ్యోల్బణం ముందుగా అంచనా వేసిన 4.7 శాతం కన్నా తక్కువగా 4.5 శాతం మేర నమోదు కాగలదని తెలిపింది. వివిధ అంశాల కారణంగా సరఫరా, డిమాండ్‌పై ప్రభావం చూపుతూ బ్రెంట్‌ క్రూడాయిల్ రేట్ల హెచ్చుతగ్గులకు లోను కావడం కొనసాగుతుందని వివరించింది. వీటితో పాటు ఇతరత్రా దేశీయ అంశాల కారణంగా 2019, 2020లో వర్ధమాన ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణం ముందుగా అంచనా వేసినట్లు 2.5 శాతం కాకుండా 2.6 శాతంగా నమోదు కావొచ్చని ఏడీబీ తెలిపింది. You may be interested

పిరమల్‌ రూ.1,500 కోట్ల ఎన్‌సీడీల సమీకరణ

Monday 22nd July 2019

అజయ్ పిరమల్ నియంత్రణలో ఉన్న పిరమల్ ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్స్ (ఎన్‌సిడి) ద్వారా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి రూ.1,500 కోట్లు సమీకరించిందని పరిశీలకులు తెలిపారు. పిరమల్‌ గ్రూప్‌కు చెందిన పిరమల్‌ క్యాపిటల్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల కార్యక్రమాల మూలధన అవసరాలను తీర్చడానికి కూడా ఈ మొత్తాన్ని ఉపయోగిచంనున్నామని పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ తెలిపింది. దీంతోపాటు జనవరి 2020 లో తిరిగి చెల్లించవలసిన  కాల-సంబంధిత రుణ చెల్లింపులకు ఈ మొత్తాన్ని

భారీ డిస్కౌంట్‌లో పలు స్టాకులు.. కొనొచ్చా?

Monday 22nd July 2019

వేచిచూడమంటున్న నిపుణులు నిఫ్టీలో ట్రేడయ్యే స్టాకుల్లో మూడింట రెండొంతుల స్టాకులు తమ ఏడాది గరిష్ఠాల కన్నా 10- 70 శాతం డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. ఈ స్టాకుల్లో బలహీనత సూచీలను రెండునెలల కనిష్ఠానికి తెచ్చింది. నిఫ్టీలోని 34 స్టాకులు, సెన్సెక్స్‌లోని 18 స్టాకులు తమ ఏడాది హై కన్నా భారీ దిగువన ట్రేడవుతున్నాయి. ఇలా డిస్కౌంట్‌లో ఉన్న స్టాకుల్లో సిప్లా, టైటాన్‌, ఓఎన్‌జీసీ, హీరోమోటోకార్‌‍్ప, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యుస్టీల్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ

Most from this category