News


చతికిలబడ్డ పారిశ్రామిక రంగం!

Saturday 11th May 2019
news_main1557553903.png-25673

  •  మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణత
  • మైనస్‌ 0.1 శాతంగా నమోదు
  • 21 నెలల కనిష్టస్థాయి
  • 78 శాతం వెయిటేజ్‌ ఉన్న 
  • తయారీ రంగం నీరసం
  • మిగతా రంగలూ ఇదే ధోరణి

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019 మార్చిలో (2018 మార్చితో పోల్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధి నమోదుకాలేదు. (మైనస్‌) 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. పారిశ్రామిక రంగంలో ఈ తరహా క్షీణత పరిస్థితి తలెత్తడం 21 నెలల్లో ఇది తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం కలిగిన తయారీ రంగం పేలవ పనితీరు మొత్తం సూచీపై ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...
- 2018 మార్చిలో ఐఐపీ వృద్ధి రేటు 5.3 శాతం. 
- 2017 జూన్‌లో 0.3 శాతం క్షీణత నమోదయ్యింది. అటు తర్వాత ఈ తరహా ఫలితం ఇదే తొలిసారి. 
-  ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి రేటునూ దిగువముఖంగా సవరించడం గమనార్హం. ఇంతక్రితం ఈ రేటు 0.1 శాతం అయితే ఇప్పుడు 0.07 శాతానికి కుదించారు. 
- మార్చి నెలలో తయారీ రంగాన్ని చూస్తే, వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణించింది. 2018 ఇదే నెలలో ఈ రంగం 5.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మొత్తం 23 గ్రూపుల్లో 12 గ్రూపులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. 
- భారీ పెట్టుబడులకు ప్రతిబింబమైన భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగం మార్చి నెలలో మరింతగా క్షీణించింది. 2018 మార్చిలో 3.1 శాతం క్షీణతలో ఉన్న ఈ విభాగం, తాజాగా 8.7 శాతం కిందకు దిగింది. 
- విద్యుత్‌ రంగం ఉత్పత్తి వృద్ధిలోనే ఉన్నా... ఈ స్పీడ్‌ 5.9 శాతం నుంచి (2018 మార్చి) 2.2 శాతానికి (2019 మార్చి) పడిపోయింది. 
- మైనింగ్‌ రంగంలోనూ విద్యుత్‌ రంగం ధోరణే కనబడింది. వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయింది. 
- కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో -5.1 శాతం క్షీణత నమోదయితే, కన్జూమర్‌ నాన్‌- డ్యూరబుల్స్‌ విభాగంలో కేవలం 0.3 శాం వృద్ధి నమోదయ్యింది. 
2018-19లో మూడేళ్ల కనిష్టస్థాయి
వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకూ పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు మూడేళ్ల కనిష్టస్థాయి.  2017-18లో వృద్ధి రేటు 4.4 శాతం. 2016-17లో 4.6 శాతం, 2015-16లో 3.3 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. 



You may be interested

బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఎయిరిండియా

Saturday 11th May 2019

చివరి నిమిషం బుకింగ్స్‌పై 50% డిస్కౌంట్‌ ముంబై: విమాన డిపార్చర్‌కు మూడు గంటల ముందు బుకింగ్స్‌పై 50 శాతం ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా శుక్రవారం ప్రకటించింది. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన ప్యాసింజర్లకు ఈ ఆఫర్‌ ఎంతగానో ఉపయోగపడనుందని.. సంస్థకు చెందిన కౌంటర్లు, వెబ్ సైట్, మొబైల్ యాప్‌, ఎజెంట్ ద్వారా జరిగే బుకింగ్స్‌కు ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది. ‘హ్యఫ్టీ డిస్కౌంట్‌’ పేరుతో ఈ ఆఫర్‌

6 నెలల్లో షూ మార్చేస్తున్నారు

Saturday 11th May 2019

6 నెలల్లో షూ మార్చేస్తున్నారు చెప్పులు వద్దు షూలే ముద్దంటున్న దేశీయ మిలియనీర్స్‌ సగటున ప్రతీ ఒక్కరి వద్ద 2-3 జతలు అభివృద్ధి చెందిన దేశాల్లో సగటున 6 జతల షూలు  ఈ ఏడాది రూ.1,000 కోట్ల వ్యాపార లక్ష్యం దక్షిణ భారతదేశంలో 30 ​ఫ్రాంచైజీల ఏర్పాటు వాకరూ బ్రాండ్‌ అం‍బాసిడర్‌గా అమీర్‌ఖాన్‌ ‘సాక్షి’తో వాకరూ చైర్మన్‌ వి.నౌషద్‌ సాక్షి, అమరావతి: దేశీయ యువత తక్కువ బరువు ఉన్న స్పోర్ట్‌ షూలవైపు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారని, ఒకసారి విడుదలైన మోడల్‌ ఆరు

Most from this category