News


పారిశ్రామిక వృద్ధి అరశాతమే

Saturday 12th January 2019
news_main1547273173.png-23549

- నవంబర్‌లో తీవ్ర నిరాశాకర ఫలితం
- 17 నెలల కనిష్ట స్థాయి ఇది...
- తయారీ, వినియోగంలో
అసలు నమోదుకాని​వృద్ధి
- భారీ యంత్రాల డిమాండ్‌ను
సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌దీ ఇదే ధోరణి

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం నవంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ నెలల్లో కేవలం 0.5 శాతంగా (2017 ఇదే నెలతో​ పోల్చి) నమోదయ్యింది. సూచీలోని తయారీ, వినియోగ రంగాల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ రేటు నమోదయ్యింది. భారీ యంత్ర పరికరాల డిమాండ్‌ను సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌లో కూడా ఇదే ధోరణి నెలకొంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన నవంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి లెక్కల్లో ముఖ్యమైన అంశాలు...

- మొత్తం సూచీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో నవంబర్‌లో వృద్ధిలేకపోగా -0.4 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2017 ఇదే నెలలో ఈ రేటు 10.4 శాతం.  ఈ విభాగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10తప్ప మిగిలినవి ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి.
- డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో కూడా వృద్ధిలేకపోగా -3.4 శాతం క్షీణత నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ  రంగం వృద్ది రేటు 3.7 శాతం.
- కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ రంగంలో కూడా 3.1 శాతం వృద్ధి రేటు 0.9 శాతం క్షీణతలోకి జారింది.
- కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ విషయంలో కూడా 23.7 శాతం భారీ వృద్ధిరేటు 0.6 శాతం క్షీణతలోకి పడిపోవడం గమనార్హం.
- మైనింగ్‌ రంగం వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 2.7 శాతానికి పెరిగింది.
- విద్యుత్‌ రంగంలో ఉత్పత్తి 3.9 శాతం నుంచి 5.1 శాతానికి ఎగసింది.
- 2017 నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది రేటు 8.5 శాతం.
- ప్రస్తుతం నమోదయిన తక్కువ స్థాయి వృద్ధి రేటు 2017 జూన్‌ తరువాత ఎప్పుడూ నమోదుకాలేదు. ఆ నెల్లో పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధిలేకపోగా -0.3 శాతం క్షీణత నమోదయ్యింది.
- 2018 అక్టోబర్‌లో వృద్ధిరేటును 8.1 శాతం నుంచి 8.4 శాతానికి పెంచడం విశేషం.

ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ పర్లేదు...
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య పారిశ్రామిక ఉత్పత్తి (2017 ఇదే కాలంతో పోల్చి) 3.2 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది.
-------------
లో బేస్‌ కారణం...
2017 నవంబర్‌లో పలు కారణాలు పారిశ్రామిక ఉత్పత్తి పెరగడానికి కారణమయ్యాయి. జీఎస్‌టీ సంబంధ ప్రతికూలతలు ఎగుమతిదారులపై తగ్గాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల కొన్ని రంగాల్లో నెలకొన్న ప్రతికూలతలూ 2017 నవంబర్‌ నాటికి ఉపశమించాయి. అప్పటి హై బేస్‌ 2018 నవంబర్‌ సమీక్షపై ప్రభావం చూపింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ది రేటు 5 నుంచి 6 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం.

 



You may be interested

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా

Saturday 12th January 2019

న్యూఢిల్లీ:  నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్‌ అశోక్‌ చావ్లా శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణం అమల్లోకి వస్తుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని న్యాయపరమైన పరిణామాల కారణంగా చావ్లా రాజీనామా చేశారని పేర్కొంది. మరే ఇతర వివరాలను ఎన్‌ఎస్‌ఈ వెల్లడించలేదు. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో అశోక్‌ చావ్లా, మరో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులపై చార్జీషీటు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందామని సీబీఐ

యస్ బ్యాంక్ చీఫ్ రేసులో ఇద్దరు..

Saturday 12th January 2019

 లిస్టులో రజత్ మోంగా, విదేశీ బ్యాంక్ సీఈవో పేర్లు న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ ‍బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ వారసుడిని ఎంపిక చేసేందుకు రూపొందించిన షార్ట్‌ లిస్ట్‌లో ఇద్దరి పేర్లు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిలో ఒకరు యస్ బ్యాంక్‌లో ప్రస్తుతం సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా ఉన్న రజత్ మోంగా కాగా మరొక పేరు విదేశీ బ్యాంక్ సీఈవోది ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో యస్‌ బ్యాంక్

Most from this category