News


ఫిబ్రవరిలో సేవలు బాగున్నాయ్‌!

Thursday 5th March 2020
news_main1583378348.png-32284

  • సూచీ ఏడేళ్ల గరిష్టం 57.5కు అప్‌

న్యూఢిల్లీ: సేవల రంగం ఫిబ్రవరిలో గణనీయ పురోగతిని సాధించింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ఫిబ్రవరిలో ఏకంగా 57.5కు చేరింది. గడచిన ఏడేళ్లలో ఈ స్థాయి పురోగతి నమోదుకాలేదు. 2013 తర్వాత ఈ స్థాయి పెరుగుదల నమోదుకావడం ఇదే తొలిసారి.  జనవరిలో ఈ సూచీ 55.5 వద్ద ఉంది. ఫిబ్రవరి వరకూ గడచిన ఐదు నెలల్లో సేవల రంగం సూచీ అప్‌ట్రెండ్‌లో ఉంది. వ్యాపార ఆర్డర్లు పెరగడం, ఎగుమతుల డిమాండ్‌ బాగుండడం, వ్యాపార విశ్వాసం బలోపేతం వంటి అంశాలు దీనికి కారణం.

తయారీ- సేవలు కలిసినా... అప్‌ట్రెండే!
ఇదిలావుండగా, ఫిబ్రవరిలో తయారీ, సేవల రంగాలు కలగలిపిన కాంపోజిట్‌ పీఎంఐ అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ 57.6గా నమోదయ్యింది. జనవరిలో ఇది 56.3 వద్ద ఉంది. ప్రైవేటు రంగ వ్యాపార క్రియాశీలత ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిలో ఉందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ ప్రకారం సూచీ 50 పైన ఉంటే అది వృద్ధి ధోరణిగా పరిగణించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. 



You may be interested

విదేశాల్లో నేరుగా లిస్టింగ్‌..!

Thursday 5th March 2020

దేశీ సంస్థలకు అవకాశం ఎయిరిండియాలో ఎన్నారైలకి  100% వాటాలకు అనుమతులు కంపెనీల చట్టంలో 72 సవరణలు క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు విదేశీ ఎక్స్చేంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన

బాకీలు వెంటనే కట్టేయండి

Thursday 5th March 2020

టెల్కోలకు డాట్‌ లేఖ న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్‌ సంబంధ మిగతా బాకీలను కూడా వెంటనే కట్టేయాలంటూ టెల్కోలను కేంద్రం ఆదేశించింది. భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాతో పాటు ఇతర ఆపరేటర్లకు టెలికం శాఖ (డాట్) ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 'మరింత జాప్యం లేకుండా' మిగతా బకాయిలు చెల్లించడంతో పాటు స్వీయ మదింపు గణాంకాలు తదితర వివరాలు కూడా సమర్పించాలని డాట్ సూచించినట్లు

Most from this category