News


ఈసారి 5 శాతం లోపే వృద్ధి

Monday 9th December 2019
news_main1575860799.png-30119

  • ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక

న్యూఢిల్లీ: ఉద్దీపన చర్యల ప్రభావం పూర్తి స్థాయిలో ప్రతిఫలించడానికి మరింత సమయం పట్టేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. బలహీన ఆర్థిక రంగ పరిస్థితులు.. భారత వృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని తెలిపింది. మొండిబాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్తగా రుణాలివ్వలేని పరిస్థితి కూడా ఇందుకు కారణం కానుందని పేర్కొంది. అటు బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న సంక్షోభం .. వాటికి రుణాలిచ్చిన బ్యాంకులకు కూడా వ్యాపించే రిస్కులు పొంచి ఉన్నాయని, రుణ వృద్ధిపై ఇవి కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ తెలిపింది. ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల తయారీ రంగానికి, పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని వివరించింది. దీనితో రహదారులు, రైల్వే, నౌకాశ్రయాలతో పాటు ఆస్పత్రులు.. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం వంటి వాటిపై ప్రభుత్వం మరింతగా వ్యయం చేయవచ్చని పేర్కొంది. 2019-20 జీడీపీ వృద్ధి అంచనాలను ఇటీవలే ఆర్‌బీఐ 6.1 శాతం నుంచి 5 శాతానికి కుదించిన నేపథ్యంలో తాజా ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

భారత్‌లో వృద్ధి మాంద్యం..

Monday 9th December 2019

భారత్‌లో వృద్ధి మాంద్యం.. అధికారాలన్నీ పీఎంవోలోనే కేంద్రీకృతం దేశానికి ఇది శ్రేయస్కరం కాదు విమర్శిస్తే రాజకీయ దురుద్దేశాలు అంటగట్టొద్దు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: పాలనాధికారాలన్నీ ప్రధాని కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, మంత్రులంతా నిమిత్తమాత్రులుగానే ఉంటున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పాలనతో ఎకానమీ తీవ్ర రుగ్మతలతో సతమతమవుతోందని .. దేశం "వృద్ధి మాంద్యం" పరిస్థితుల్లో చిక్కుకుందని పేర్కొన్నారు. ఒక వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలు

పెరిగిన మారుతీ సుజుకీ ఉత్పత్తి

Monday 9th December 2019

 నవంబర్‌లో 4 శాతం అప్‌ న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి గతనెల్లో 1,39,084 యూనిట్లు కాగా, అంతకుముందు

Most from this category