News


జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 22nd February 2020
Markets_main1582349741.png-32002

  • 476.092 బిలియన్ డాలర్లుగా నమోదు

ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) ఆల్‌టైం హైకి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది ఫిబ్రవరి 14తో ముగిసిన వారంలో 3.091 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 476.092 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం 1.701 బిలియన్‌ డాలర్లు పెరిగి 473 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 2.763 బిలియన్‌ డాలర్లు పెరిగి 441.949 బిలియన్ డాలర్లకి చేరాయి. బంగారం నిల్వలు 344 మిలియన్‌ డాలర్లు తగ్గి 29.123 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 6 మిలియన్ డాలర్లు తగ్గి 1.430 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నిధి వద్ద ఉన్నటువంటి దేశీ నిల్వలు 9 మిలియన్‌ డాలర్లు పెరిగి 3.590 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 



You may be interested

మరో కేజీఎఫ్‌! రూ.12 లక్షల కోట్ల బంగారం గనులు!

Saturday 22nd February 2020

బంగారం ధరలు ఆకాశనంటుతున్న తరుణంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)బంగారు నిక్షేపాల్ని గుర్తించినట్లు తీపి కబురు చెప్పింది. ఉత్తర ప్రదేశ్‌లోని నక్సలైట్‌ ప్రభావిత ప్రాంతమైన సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకు పైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్‌ఐ, ఉత్తరప్రదేశ్‌ భూగర్భ, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. వీటి విలువ సుమారు రూ12 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని సోన్‌ పహాడీ, హార్దీ ప్రాంతాలలో ఈ బంగారు గనులు

1850 డాలర్ల వరకూ పుత్తడి పెరగొచ్చు: గోల్డ్‌మెన్‌ శాక్స్‌

Saturday 22nd February 2020

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న బలహీనత, దిగివచ్చిన యూఎస్‌ ఈల్డ్స్‌తో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,750డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్‌శాక్స్‌ శుక్రవారం తన నివేదికలో పేర్కోంది. వ్యాధి వ్యాప్తి మరింత ఉధృతమైతే రానున్న రోజుల్లో బంగారం ధర 1850డాలర్ల స్థాయిని కూడా అందుకునే అవకాశం ఉందని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అంచనా వేసింది.  రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర ఇంట్రాడే ఏడేళ్ల గరిష్టస్థాయి(1,651.85)ని

Most from this category