భారత్ విదేశీ రుణ భారం 543 బిలియన్ డాలర్లు
By Sakshi

ముంబై: భారత్ విదేశీ రుణ భారం 2019 మార్చి ముగిసేనాటికి 543 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్బీఐ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం 2018 మార్చి ముగింపుతో పోల్చిచూస్తే భారత్ విదేశీ రుణ భారం 2.63 శాతం (13.7 బిలియన్ డాలర్లు) పెరిగింది. స్వల్పకాలిక, వాణిజ్య రుణాలు పెరగడం, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) డిపాజిట్లు వంటి అంశాలను ఆర్బీఐ తన గణాంకాల్లో ప్రస్తావించింది. కాగా 2019 మార్చి నాటికి జీడీపీలో విదేశీ రుణ నిష్పత్తి 19.7 శాతం ఉంది. 2018 మార్చినాటికి ఈ నిష్పత్తి 20.1 శాతం కావడం గమనార్హం. భారత్ విదేశీ రుణాల్లో వాణిజ్య రుణాలు 38 శాతం. ఎన్ఆర్ఐ డిపాజిట్లు 24 శాతం. స్వల్పకాలిక ట్రేడింగ్ రుణం 18.9 శాతం.
You may be interested
కొచర్ దంపతులు, దూత్‌ను ప్రశ్నించిన ఈడీ
Saturday 29th June 2019న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో అయిన చందాకొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూపు ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వారిని ప్రశ్నించి సమాధానాలను అధికారులు నమోదు చేసుకున్నారు. బ్యాంకు చీఫ్‌గా ఉన్న చందాకొచర్ ఉన్న సమయంలో వీడియోకాన్ గ్రూపునకు రుణం జారీ అనంతరం ఆమె కుటుంబానికి లబ్ది కలిగినట్టు అరోపణలు ఎదుర్కొంటున్న విషయం
2018-19లో క్యాడ్ 2.1 శాతం
Saturday 29th June 2019ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీలు మినహా ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2.1 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యింది. విలువ రూపంలో ఈ పరిమాణం 57.2 బిలియన్ డాలర్లు. కాగా 2017-18లో క్యాడ్ జీడీపీ విలువలో 1.8 శాతమే (48.7 బిలియన్ డాలర్లు) కావడం గమనార్హం. మార్చి త్రైమాసికంలో సానుకూలం అయితే