News


ఆరేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి?!

Friday 29th November 2019
news_main1575004726.png-29948

రాయిటర్స్‌ పోల్‌ అంచనా
దేశీయ ఎకానమీ గత ఆరేళ్లలో అత్యంత కనిష్ఠ వృద్ధిని సెప్టెంబర్‌ త్రైమాసికంలో నమోదు చేయవచ్చని రాయిటర్స్‌పోల్‌లో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. క్యు2లో జీడీపీ 4.7 శాతానికి పరిమితం కావచ్చని పోల్‌లో సరాసరిన అంచనా వేశారు. ఇది గత త్రైమాసికం వృద్ధి 5 శాతం కన్నా తక్కువ. ప్రైవేట్‌ పెట్టుబడులు బలహీనపడడం, కన్జూమర్‌ డిమాండ్‌ మందగమనం, అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు.. ఎకానమీపై ప్రభావం చూపాయని నిపుణులు భావిస్తున్నారు. తాజా అంచనాలు నిజమైతే ఇది ఆరేళ్లలో కనిష్ఠ వృద్ధి కానుంది. గతంలో 2013 జనవరి- మార్చిలో జీడీపీ 4.3 శాతంగా నమోదయింది. డిసెంబర్లో ఆర్‌బీఐ మరో పావు శాతం రేట్లను తగ్గించవచ్చని ఇదే పోల్‌లో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. వచ్చేనెల 3-5 మధ్య ఆర్‌బీఐ మధ్యంతర సమీక్ష జరగనుంది. వ్యవసాయ సంక్షోభం, పేలవ ఆదాయాలు, పట్టణాల్లో అంతంతమాత్రపు ఆదాయ వృద్ధి.. వినిమయాన్ని బలహీనపరిచాయని ఫిచ్‌ రేటింగ్స్‌ అనలిస్టు దేవేంద్ర పంత్‌ చెప్పారు. పండుగ సీజన్‌ కూడా రికవరీని తీసుకురాలేకపోయిందన్నారు.

మరోవైపు ఎకానమీ సంక్షోభంలో పడిందని, ఆర్థిక అత్యవసర పరిస్థితి కనిపిస్తోందని విపక్షాలు పార్లమెంట్‌లో దుయ్యబట్టాయి. ఆర్థిక మంత్రి మాత్రం ఎకానమీలో మందగమనం ఉంది కానీ మాంద్య పరిస్థితులు లేవని చెప్పారు. ఎకానమీలో పురోగతికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వవ్యయం మరింతగా పెంచేందుకు పార్లమెంట్‌ అనుమతి కోరారు. దేశీయంగా పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అరికట్టాలంటే ఎకానమీ జీడీపీ 8 శాతం చొప్పున వృద్ధి చూపాలని అనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ నిరుద్యోగ రేటు దాదాపు 8.5 శాతం ఉంది. కొందరు ఎకనమిస్టులు మాత్రం ఆర్థిక సంవత్సరం ద్వితీయార్దంలో ప్రభుత్వ చర్యలు ఫలితాలిస్తాయని నమ్ముతునానరు. ఎకానమీ బాటమ్‌అవుట్‌ అయిందని, ఇకపై రికవరీ ఉంటుందని ప్రముఖ ఎకనమిస్టు భానుమూర్తి అభిప్రాయపడ్డారు.You may be interested

యస్‌ బ్యాంక్‌ నిధులు సమీకరణ ఫలించేనా?

Friday 29th November 2019

దేశీయ అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌లలో ఒకటైనా యస్‌ బ్యాంక్‌ తన నిధుల సమీకరణకు సంబంధించిన వివరాలను శుక్రవారం జరగనున్న బోర్డు మీటింగ్‌ తర్వాత మీడియాకు విడుదల చేసే అవకాశం ఉంది. తీవ్ర రుణ భారం, ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్స్‌) సంక్షోభం వంటి అనేక సమస్యలు చుట్టుముట్టడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ ఈ ఏడాదిలో భారీగా పడిపోయింది. కాగా 1.2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరించడంపై  మేనేజ్‌మెంట్‌ దృష్ఠి

భారతి ఇన్‌ఫ్రాటెల్‌ 10 శాతం అప్‌

Friday 29th November 2019

వరుసగా రెండోరోజూ భారతీ ఇన్ఫ్రాటెల్‌ షేరు లాభాల బాట పట్టింది. నేడు ఈ షేరు రూ.248.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఈ షేరుకు ట్రేడర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో 10శాతానికి పైగా లాభపడి రూ.282.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:20ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.256.50)తో పోలిస్తే 7.76శాతం లాభంతో రూ.276.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డిసెంబర్‌01 నుంచి టెలికాం

Most from this category