News


2018-19లో క్యాడ్‌ 2.1 శాతం

Saturday 29th June 2019
news_main1561781997.png-26678

ముంబై: కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌- ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీలు మినహా ఒక నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2.1 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యింది. విలువ రూపంలో ఈ పరిమాణం 57.2 బిలియన్‌ డాలర్లు. కాగా 2017-18లో క్యాడ్‌ జీడీపీ విలువలో 1.8 శాతమే (48.7 బిలియన్‌ డాలర్లు) కావడం గమనార్హం. 

మార్చి త్రైమాసికంలో సానుకూలం
అయితే 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో క్యాడ్‌ ఆ కాలపరిధి జీడీపీతో పోల్చితే కేవలం 0.7 శాతంగా (4.6 బిలియన్‌ డాలర్లు) ఉండడం గమనార్హం. 2017-18 ఇదే త్రైమాసికకాలంలో ఈ రేటు 1.8 శాతం (13 బిలియన్‌ డాలర్లు)గా ఉంది. 2018-19 డిసెంబర్‌ త్రైమాసికంలో కూడా క్యాడ్‌ భారీగా 2.7 శాతం (27.7 బిలియన్‌ డాలర్లు) ఉండడం గమనార్హం. మార్చి త్రైమాసికంలో ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు తక్కువగా ఉండడం క్యాడ్‌కు కలిసి వచ్చిన అంశం.



You may be interested

భారత్‌ విదేశీ రుణ భారం 543 బిలియన్‌ డాలర్లు

Saturday 29th June 2019

ముంబై: భారత్‌ విదేశీ రుణ భారం 2019 మార్చి ముగిసేనాటికి 543 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్‌బీఐ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం 2018 మార్చి ముగింపుతో పోల్చిచూస్తే భారత్‌ విదేశీ రుణ భారం 2.63 శాతం (13.7 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. స్వల్పకాలిక, వాణిజ్య రుణాలు పెరగడం, ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) డిపాజిట్లు వంటి అంశాలను ఆర్‌బీఐ తన గణాంకాల్లో ప్రస్తావించింది. కాగా 2019 మార్చి

ఆసియా టాప్‌-20 ఖరీధైన నగరాల్లో ‘ముంబై’

Saturday 29th June 2019

మెర్సెర్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: ఆసియాలోని టాప్‌-20 ఖరీధైన నగరాల జాబితాలో ముంబై చోటు దక్కించుకుంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారికి ఈ నగరం అత్యంత ఖరీధైనదని గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెర్సెర్ తన నివేదికలో పేర్కొంది. ఇక అత్యధిక నివాస గృహాల ధరలను కలిగిన సిటీల్లో ప్రపంచ స్థాయి రికార్డును నెలకొల్పినట్లు తెలిపింది. జీవన వ్యయంపై ఈ సంస్థ 209 నగరాల్లో సర్వే నిర్వహించగా.. ముంబై 67వ స్థానంలో

Most from this category