News


ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది

Friday 24th January 2020
Markets_main1579834665.png-31148

  • భారత్‌లో పెట్టుబడులకు ఉత్సాహపూరిత వాతావరణం
  • కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌


దావోస్‌ (స్విట్జర్లాండ్‌): భారత ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నట్టు పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో చర్చలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. జనవరి చివరికి ఈయూ నుంచి బ్రిటన్‌ వేరుపడనున్న సంగతి తెలిసిందే. ‘‘పరిస్థితులు మరోసారి ఎగువవైపునకు (మెరుగుపడడం) సూచిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు (వృద్ధి పుంజుకోవడం) సిద్ధంగా ఉంది. మొదటి విడతలో మాకు భయానక రూపంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా వచ్చింది. తిరిగి పట్టాలెక్కించేందుకు చర్యలు తీసుకున్నాం’’ అని చెప్పారు. 

  • ఆర్‌సీఈపీ ఆమోదనీయంగా లేదు

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందాన్ని (ఆర్‌సీఈపీ) అసమతుల్య వాణిజ్య ఒప్పందంగా మంత్రి పీయూష్‌ గోయల్‌ అభివర్ణించారు. అందుకే భారత్‌ అందులో భాగం కాలేదన్నారు. ఆర్‌సీఈపీకి వెలుపల భారత్‌ ఇప్పటికే జపాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాలతో కూడిన ఆసియాన్‌ 10తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘ఆస్ట్రేలియాతోనూ చర్చలు ముగింపు దశలో ఉన్నాయి. రానున్న 6-8 నెలల్లో ఆస్ట్రేలియాతోనూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. ఆర్‌సీఈపీ అనేది చైనా, భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వంటిది. ఉదారవాద ప్రభుత్వం, మెరుగైన పారదర్శకత, నియంత్రణ విధానాలు పాటించని చోట (చైనా), భారత వస్తు, సేవలకు పరస్పర రీతిలో మార్కెట్‌ అవకాశాలు కల్పించని దేశంతో ఒప్పందానికి భారత్‌ సిద్ధంగా ఉందని నేను అనుకోవడం లేదు’’ అని మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. 

  • మంత్రిని కాకపోతే ఎయిర్‌ఇండియాకు బిడ్డింగ్‌

‘‘నేను ఇప్పుడు మంత్రిని కాకపోయి ఉంటే ఎయిర్‌ ఇండియాకు బిడ్డింగ్‌ వేసే వాడిని. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతో ఎయిర్‌ ఇండియాకు ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి. దీంతో ఇది బంగారు గని కంటే తక్కువేమీ కాదు’’ అని ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌ ప్రైవేటీకరణపై ఎదురైన ప్రశ్నకు సమాధానంగా మంత్రి గోయల్‌ బదులిచ్చారు. ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా ఆయా దేశాలకు నడిపే సర్వీసుల విషయంలో ఇరు దేశాల ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు నిర్దేశిత వాటా హక్కులు ఉంటాయి.

 

  • సదస్సులో ఇతర అంశాలు
  •  సమాచార గోప్యత (డేటా ప్రైవసీ)ను మానవ హక్కుగా చూడాలని, దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అనుమతి మేరకే పెద్ద ఎత్తున డేటాను వినియోగించుకోవడం సమాజానికి మంచిదని సూచించారు.
  • ఫ్యాషన్‌ పరిశ్రమలో ఆవిష్కరణలు అసాధారణ రీతిలో 20-30 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల అవకాశాలు కల్పిస్తున్నట్టు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) అధ్యయనం స్పష్టం చేసింది.
  • స్థిరమైన ఇంధన పరివర్తన దిశగా బ్యాటరీలకు సంబంధించి నూతన నియమాలను నిర్ణయించేందుకు అమరరాజా బ్యాటరీస్‌ సహా అంతర్జాతీయంగా 42 సంస్థలు అంగీకారం తెలిపాయి. 
  • బిట్‌కాయిన్‌ వంటి డిజిటల్‌ కరెన్సీలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో ఈ విషయమై సెంట్రల్‌ బ్యాంకులకు సాయపడేందుకు డబ్ల్యూఈఎఫ్‌, 40 దేశాల కేంద్ర బ్యాంకులతో కూడిన కమ్యూనిటీ ఓ కార్యాచరణను రూపొందించింది.  You may be interested

హైదరాబాద్‌ వద్ద ‘యువిక్‌’ మరో ప్లాంటు

Friday 24th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అల్యూమినియం విండోస్‌, డోర్స్‌ తయారీలో ఉన్న యువిక్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్‌ కొత్త ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లి వద్ద ఇది ఎనమిది నెలల్లో రానుంది. 10 ఎకరాల్లో నెలకొల్పనున్న ఈ ప్లాంటుకు రూ.12 కోట్ల దాకా వ్యయం చేస్తున్నట్టు యువిక్‌ ఎండీ తరుణ్‌ సందీప్‌ తెలిపారు. కంపెనీ ఈడీ చైతన్య బోయపాటి, వైకేకే ఏపీ డైరెక్టర్‌ మిచిషిత, బొరూకా ఎక్స్‌ట్రూషన్‌ డైరెక్టర్‌ రజత్‌ అగర్వాల్‌తో

ఇల్లు చక్కదిద్దండి..!

Friday 24th January 2020

రుణాలు పునర్‌వ్యవస్థీకరించాలి స్టాంపు డ్యూటీ తగ్గించాలి పన్నులను హేతుబద్ధీకరించాలి గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలి రియల్టీ కోర్కెల చిట్టా..     దేశీయంగా రియల్టీ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యధికంగా ఉద్యోగాలు కల్పించే రంగాల్లో రెండో స్థానంలో ఉంటుంది. స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా సుమారు 10 శాతం. రియల్టీ రంగంలో కమర్షియల్‌ లీజింగ్, లావాదేవీల వృద్ధి మెరుగ్గానే ఉన్నా.. రెసిడెన్షియల్‌ రంగం అంతంత మాత్రంగానే ఉంటోంది. ప్రాజెక్టుల జాప్యం, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు కుదేలవడం తదితర

Most from this category