News


భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం

Saturday 4th January 2020
news_main1578111913.png-30665

2019లో అత్యధికంగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు
ఇదే పరిస్థితి 2020లోనూ కొనసాగొచ్చు: డీబీఎస్‌

సింగపూర్‌: భారత ఆర్థిక వ్యవస్థ 2019లో అంతర్జాతీయంగా ఉన్న సానుకూల వాతావరణంతో ప్రయోజనం పొందిందని, ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్‌ గ్రూపు డీబీఎస్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి నిలకడగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా అధిక లిక్విడిటీ (పెట్టుబడులు), చమురు ధరలు నిలకడగా ఉండడం వంటివి సానుకూలించినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2019-20లో ఇప్పటి వరకు బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు సగటున 65 డాలర్లుగా ఉందని, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 70 డాలర్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. 2019 కేలండర్‌ సంవత్సరంలో భారత్‌ 19 బిలియన్‌ డాలర్ల పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను నికరంగా ఆకర్షించిందని, 2017 తర్వాత ఇది అత్యధికమని తెలిపింది. అదే సమయంలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు ఆరేళ్లలోనే గరిష్టంగా ఉన్నాయని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2019-20 మొదటి పది నెలల్లో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం పెరిగినట్టు తెలిపింది. సానుకూల అంశాలు ఇలానే కొనసాగితే 2020లోనూ విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. సమీప కాలంలో అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం పురోగతి అంశంపై ఇది ఆధాపడి ఉంటుందని పేర్కొంది. అదే విధంగా బ్రెగ్జిట్‌, యూరోజోన్‌ రాజకీయాలు, అమెరికా ఎన్నికల అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. 



You may be interested

సరికొత్త రికార్డులకు విదేశీ మారక నిల్వలు

Saturday 4th January 2020

ముంబై: భారత్‌ విదేశీ మారకపు నిల్వల రికార్డుల జోరు కొనసాగుతోంది. డిసెంబర్‌ 27వ తేదీతో ముగిసిన వారంలో నిల్వలు 2.52 బిలియన్‌ డాలర్లు పెరిగి 457.46 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. ఆర్‌బీఐ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ అసెట్స్‌ విలువ 2.20 బిలియన్‌ డాలర్లు ఎగసి 424.936 బిలియన్లకు చేరింది.  పసిడి నిల్వల విలువ  27.392 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  అంతర్జాతీయ ద్రవ్యనిధి

భగ్గుమన్న బంగారం, క్రూడాయిల్‌ ధరలు

Saturday 4th January 2020

ఇరాన్‌ కమాండర్‌ని అమెరికా‍​హతమార్చిన నేపథ్యం 4 శాతం పెరిగి 64 డాలర్లను తాకిన నైమెక్స్‌ క్రూడ్‌ 25 డాలర్లు ఎగసిన బంగారం భౌగోళిక ఉద్రిక్తతలతో సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడులు న్యూఢిల్లీ: ఇరాన్‌ కమాండర్‌ ఖాసీమ్‌ సొలేమానిని అమెరికా హతమార్చడం.. భౌగోళిక ఉద్రిక్తతలకు దారి తీసింది. అంతర్జాతీయంగా అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు.. సురక్షిత సాధనాల వైపు మొగ్గు చూపారు. దీంతో బంగారం, క్రూడ్‌, డాలర్‌ ఇండెక్స్‌ శుక్రవారం భారీగా పెరిగాయి. వేర్వేరుగా ఆయా అంశాలపై దృష్టి సారిస్తే...     బంగారం:-

Most from this category