News


భారత్‌కు అంతర్జాతీయ పరిణామాల ముప్పు

Wednesday 20th November 2019
news_main1574221117.png-29718

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి
హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై క్రమంగా పెరుగుతోందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి అన్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలకు భారత్‌ కూడా కారణం అవుతోందని చెప్పారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ చాయిసెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ‘చైనా, ఇరాన్‌, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల ప్రభావం చమురు లభ్యత, నిధుల ప్రవాహానికి అవరోధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు భారత్‌కు స్వల్ప కాలానికి హాని కలుగజేసే సమస్యలే. అంతర్జాతీయ వ్యాపారంపై చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై యూఎస్‌ఏ ఆధిపత్యం ఉంది. ఇది కూడా అంతర్జాతీయ సంఘర్షణకు ఒక కారణం. ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ రెండు దేశాల దయాదాక్షిణ్యాలపై ప్రపంచం నడుస్తోంది. యూఎస్‌లో వినియోగం కోసం ఉన్న యూఎస్‌ డాలర్‌ను అంతర్జాతీయ కరెన్సీగా వాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం

Wednesday 20th November 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో మన దేశం నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా.. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. ప్రభుత్వ విధానాలు అఫర్డబుల్‌ వైపే... 2018 రెండో త్రైమాసికంలో ముంబై 30వ స్థానంలో ఉండగా.. ఇప్పుడది రెండు స్థానాలు ఎగబాకి 28కి చేరితే.. బెంగళూరు మాత్రం 15వ స్థానం నుంచి ఐదు స్థానాలు

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 77,000కుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Wednesday 20th November 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇప్పటికి 77,000 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం

Most from this category