News


జపాన్‌ను మించనున్న భారత్‌

Saturday 13th July 2019
news_main1562996278.png-27039

  • 2025 నాటికి అతి పెద్ద ఎకానమీల్లో 3వ స్థానం    
  • ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్స్‌లో భారత్ శరవేగంగా ముందుకెడుతోంది. ఈ ఏడాది బ్రిటన్‌ను తోసిరాజని అయిదో స్థానాన్ని దక్కించుకోనుంది. ఇక 2025 నాటికి జపాన్‌ను దాటి మూడో అతి పెద్ద ఎకానమీగా అవతరించనుంది. కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. "2019లో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఎకానమీగా బ్రిటన్‌ను భారత్‌ దాటేస్తుందని అంచనా. అలాగై 2025 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5.9 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరడం ద్వారా జపాన్‌ జీడీపీని దాటేయడంతో పాటు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది" అని పేర్కొంది. దేశీయంగా వినియోగదారుల మార్కెట్‌ పరిమాణం 2019లో 1.9 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025 నాటికి 3.6 లక్షల కోట్ల డాలర్లకు పెరగనుందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ అంచనా వేసింది. అతి పెద్ద ఎకానమీగా ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకునే క్రమంలో ప్రపంచ జీడీపీ వృద్ధి గతిలో భారత్ వాటా కూడా పెరుగుతుందని వివరించింది. ఇదంతా సాధించేందుకు, వచ్చే ఐదేళ్లలో నిలకడైన ఆర్థిక వృద్ధి నమోదు చేసేందుకు భారత్‌ పెట్టుబడులు, పొదుపు, ఎగుమతులను ప్రోత్సహించాల్సి ఉంటుందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ పేర్కొంది.



You may be interested

అవన్నీ నిరాధార ఆరోపణలే

Saturday 13th July 2019

గంగ్వాల్‌పై భాటియా గ్రూప్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో గవర్నెన్స్‌ పరమైన లొసుగులున్నాయంటూ సహ ప్రమోటరు రాకేష్ గంగ్వాల్ చేసిన ఆరోపణలను మరో ప్రమోటరు రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజేస్‌ (ఐజీఈ) ఖండించింది. ఇవన్నీ పసలేని ఆరోపణలేనని వ్యాఖ్యానించింది. ఇండిగో 'పాన్‌షాపు' కన్నా అధ్వాన్నంగా తయారైందంటూ గంగ్వాల్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 'పాన్‌షాపు' సమర్ధులైన అధికారుల సారథ్యంలో చక్కగానే పనిచేస్తోందని, ఆర్థికంగా పటిష్టంగానే

ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి!

Saturday 13th July 2019

ఆందోళనకలిగిస్తున్న పారిశ్రామిక,  ద్రవ్యోల్బణం గణాంకాలు మేలో ఐఐపీ వృద్ధి స్పీడ్‌ 3.1 శాతం మైనింగ్‌, తయారీ పేలవ పనితీరు రిటైల్‌ ధరల పరుగు జూన్‌లో 3.18 శాతం వరుసగా ఆరునెలల నుంచీ ఎగువముఖం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శుక్రవారం నిరుత్సాహకరమైన గణాంకాలు వెలువడ్డాయి. ఈ అధికారిక గణాంకాల ప్రకారం- పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించిన ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మేలో కేవలం 3.1 శాతం పెరిగింది. అంటే 2018 మేతో పోల్చితే, 2019 మేలో ఈ

Most from this category