News


సేవల రంగం వృద్ధి ఏడాది కనిష్టానికి

Thursday 6th June 2019
news_main1559805603.png-26130

  • మేలో 50.2 పాయింట్లకు నికాయ్ ఇండియా పీఎంఐ సూచీ

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, కొత్త ఆర్డర్ల రాక తగ్గడం తదితర అంశాల కారణంగా గత నెల దేశీయంగా సేవల రంగం కార్యకలాపాలు వృద్ధి ఏడాది కనిష్టానికి పడిపోయింది. దీనికి కొలమానంగా పరిగణించే నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ పీఎంఐ సూచీ మే లో 50.2 పాయింట్లకు తగ్గింది. ఏప్రిల్‌లో ఇది 51.0గా ఉంది. గడిచిన పన్నెండు నెలల్లో ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదు కావడం ఇదే ప్రథమం. అయితే, మందగమనంలో ఉన్నప్పటికీ సేవల రంగం పీఎంఐ వరుసగా 12వ నెలా వృద్ధి బాటలోనే కొనసాగడం గమనార్హం. పీఎంఐ పరిభాషలో సూచీ 50 పాయింట్లకు పైగా ఉంటే వృద్ధిని, దానికన్నా తక్కువగా ఉంటే సంకోచాన్ని సూచిస్తుంది. ఎన్నికలపరమైన అవరోధాలు, వరుసగా మూడో నెలలోనూ కొత్త వర్క్‌ ఆర్డర్ల రాక .. వ్యాపార కార్యకలాపాలు మందగించడంతో భారత సేవల రంగం వృద్ధి మే లో నెమ్మదించిందని సూచీ నిర్వహించే ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ సంస్థ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్‌, నివేదిక రూపకర్త పోల్యానా డి లిమా పేర్కొన్నారు. 
తాత్కాలికమే...
కంపెనీలు మళ్లీ నియామకాలను పెంచుకుంటుండటం, భవిష్యత్ అవకాశాలపై విశ్వాసంగా ఉండటం వంటి అంశాలు బట్టి చూస్తుంటే మందగమనం తాత్కాలికమే కావొచ్చని లిమా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇటు తయారీ అటు సేవల రంగం తీరుతెన్నులను ప్రతిఫలించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ సూచీ మే లో 51.7 పాయింట్లుగా నమోదైంది. ఏప్రిల్‌తో పోలిస్తే పెద్దగా మారలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, పాలసీ అజెండాల అమలు మళ్లీ ప్రారంభం కావడం వంటి అంశాల కారణంగా 2019 ద్వితీయార్ధం నుంచి ఎకానమీ రికవరీ బాట పట్టొచ్చని లిమా తెలిపారు. You may be interested

బీఎండబ్ల్యూతో జట్టుకట్టిన జేఎల్‌ఆర్‌

Thursday 6th June 2019

ఎలక్ట్రిక్ కార్ల టెక్నాలజీలో పరస్పర సహకారం న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌).. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూతో జట్టుకట్టింది. ఎలక్ట్రిక్ కార్ల టెక్నాలజీ అభివృద్ధి కోసం ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం వెల్లడించింది. నూతనతరం ఎలక్ట్రిక్‌ టెక్నాలజీ సహకారంలో భాగంగా ఇరు సంస్థలు.. పరిశోధన, అభివృద్ధి, ఇంజినీరింగ్‌లో సంయుక్తంగా పెట్టుబడి పెడతాయి. ఈ

‘సుందర్‌ పిచాయ్‌’కు గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు

Thursday 6th June 2019

వాషింగ్టన్‌: గూగుల్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా-భారత వాణిజ్య మండలి (యూఎస్‌ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డుకు పిచాయ్‌ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్‌డాక్‌ ప్రెసిడెంట్‌ అడెనా ఫ్రైడ్‌మాన్‌ పేరును ప్రకటించిన యూఎస్‌ఐబీసీ.. ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషిచేసినట్లు

Most from this category