News


ఒకే జీఎస్‌టీ రేటు ఉండాలి

Thursday 30th January 2020
news_main1580354258.png-31313

అధిక నిరుద్యోగిత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్వల్పంగా అధికమైన ఆదాయాల స్థాయి.. వెరశి పట్టణ డిమాండ్‌కు అడ్డుకట్ట పడుతోంది. డిమాండ్‌ తిరిగి గాడినపడాలని ఫాస్ట్‌ మూవింగ్‌ కంజ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు కోరుతున్నాయి. బడ్జెట్‌లో ప్రకటించబోయే ఉద్దీపణలపైనే ఇది ఆధారపడి ఉందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయపు పన్ను స్లాబు సవరణ, ఉద్యోగాల కల్పన, గ్రామీణ కస్టమర్లకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందజేస్తే ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయని చెబుతున్నాయి.

  • ఎఫ్‌ఎంసీజీ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. సరిపడ నగదు లభ్యత లేక చాలా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా సంప్రదాయ వ్యాపారాలు బలహీనపడుతున్నాయి. 
  • పంటలకు సరైన ధర, వ్యవసాయేతర ఆదాయాలు తగ్గడం వంటి అంశాల్లో ప్రభుత్వ మద్ధతు కొరవడి గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ నిరుత్సాహపరుస్తోంది. 
  • భారతావనిలో వినియోగం పరంగా సుమారు 75 శాతం గ్రామీణ ప్రాంతమే. ఈ నేపథ్యంలో పంటలకు మద్ధతు ధర, ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల రైతుల ఆదాయం అధికమైన ఫలితంగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీల టర్నోవర్‌ మెరుగవుతుంది. 

  • - ద్రవ్య సరఫరాను పెంచే విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలకు పూనుకుంది. అయితే డిమాండ్‌ లేకపోవడంతో ఇది పెద్దగా ప్రభావం చూపలేదు. మందగమనం నుంచి గట్టెక్కడానికి ఖర్చుచేయతగ్గ ఆదాయం పెరగాలంటే పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి. 
  • విక్రయాలు తిరిగి పుంజుకుంటే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు సామర్థ్యం పెంపుపై పెట్టుబడులు చేస్తాయి. నియామకాలను చేపడతాయి.
  • వేతనాలు అధికమైతే సేవింగ్స్‌ పెరుగుతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సంస్కరణలను తేవాలి. పలు రంగాల్లో ఉద్దీపణలు ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించే వాతావరణం కల్పించాలి.
  • జీఎస్టీ రేట్లను తగ్గించాలి. ఒకే పన్ను కిందకు అన్ని ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను తేవాలి. తయారీపై ప్రణాళికగా వెళ్లేందుకు కంపెనీలకు మార్గం ఏర్పడుతుంది. తయారీ పెరిగితే కింది స్థాయిలో తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలు అధికమవుతాయి.
  • ఈ-కామర్స్‌ కంపెనీల కారణంగా సాధారణ బిస్కట్లు, చవక తృణధాన్యాలు, గింజల అమ్మకాలు లేకుండాపోయాయి. వ్యాపారాలు గాడినపడేందుకు చిన్న కిరాణా వర్తకులు, ఎఫ్‌ఎంసీజీ దుకాణదారులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి. 
  • అత్యంత కీలక అంశమేమంటే మందగమనం నుంచి గట్టెక్కాలంటే వినియోగం పెరగాలి. ప్రభుత్వానికి పెద్ద సవాల్‌ ఏమంటే కార్పొరేట్‌ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడం, పన్ను ఆదాయం తగ్గడం వల్ల ఆదాయమూ ఆ మేరకు ప్రభావం చూపుతోంది.  సెంటిమెంటు బలపడడానికి, పన్ను ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సమతులంగా వ్యవహరించాలి. 

 You may be interested

నిఫ్టీ మద్దతు 12,099, నిరోధం 12,069

Thursday 30th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 9 పాయింట్లు డౌన్‌ ఆసియాలో జపాన్‌ మార్కెట్‌ పతనం మళ్లీ ఊపందుకున్న కరోనా భయాలు  నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 9 పాయింట్ల వెనకడుగుతో 12,112  వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,121 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే.

479శాతం ర్యాలీ చేసిన జపాన్‌ షేరు ఇదే..!

Wednesday 29th January 2020

కొత్త పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. అయితే  ఈ వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో జపాన్, సౌత్‌ కొరియా, ఇండియా స్టాక్‌ మార్కెట్లలో హెల్త్‌కేర్‌, సేఫ్టీ ప్రాడెక్ట్‌ల షేర్లకు డిమాండ్‌ పెరిగింది. మాస్క్‌లతో పాటు వైద్య ఉత్పత్తులను సరఫరా చేసే జపాన్ సంస్థ కవామోటో కార్పొరేషన్ షేరు ఈ జనవరిలో ఐదు రెట్లు పెరిగింది. టోక్యో స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో డిసెంబర్‌ 30నాడు 447

Most from this category