News


15ఏళ్ల కనిష్ఠాలకు దేశ పొదుపు రేటు!

Wednesday 19th February 2020
news_main1582094612.png-31927

భారత ఎకానమీలో పొదుపు తగ్గుతోంది. దేశ సేవింగ్స్‌ రేటు 2019లో పదిహేనేళ్ల కనిష్ఠాలకు చేరింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న పెట్టుబడులపై పొదుపురేటు పడిపోవడం మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ పొదుపులో గృహపొదుపు రేటు సైతం క్షీణత నమోదు చేసింది. వినియోగదారుల వినిమయం పెరగడం గృహపొదుపు పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ పొదుపులో గృహ పొదుపు వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. 2019 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల పొదుపు 30.1 శాతానికి పతనమైంది. 2012లో ఇది 34.6 శాతం, 2007-08లో 36 శాతం ఉంది. 2003-04 సమయంలో దేశీయ పొదుపు రేటు 29 శాతానికి పడిపోయింది. తదనంతరం 2019లో పొదుపు రేటు ఇంత క్షీణత చూసింది. దేశ జీడీపీలో గృహపొదుపు వాటా 2012నాటికి 23 శాతం ఉంటే, 2019కి 19 శాతానికి పతనమైంది.

దేశీయ పొదుపు తగ్గడంతో ఇండియా కంపెనీలు బయటనుంచి రుణాలు తీసుకోవడం పెరగనుంది. ఇది క్రమంగా దేశ బహిర్గత రుణం పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో కరెంట్‌ ఖాతా మిగులు దిగిరావడం కానీ, కరెంట్‌ ఖాతా లోటు విసృ‍్తతం కావడం కానీ జరగాలని హెచ్‌ఎస్‌బీసీ నిపుణుడు ప్రంజుల్‌ భండారీ చెప్పారు. భారత బహిర్గత రుణాలు 2019లో 54300 కోట్ల డాలర్లకు చేరాయి. ఇది 2015లో 47500 కోట్ల డాలర్లుంది. ఎకానమీలో ప్రస్తుత మందగమనం దేశీయ పొదుపు పతనానికి కొంతమేర కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే బ్రిక్స్‌ దేశాల ఎకానమీలతో పోలిస్తే ఇండియా పొదుపు రేటు బాగానే ఉంది. ప్రస్తుతం బ్రెజిల్‌ సేవింగ్స్‌ రేటు దాని జీడీపీలో 16 శాతం ఉంది. ఇతర వర్దమాన దేశాల్లో మెక్సికో సేవింగ్స్‌ రేటు 23 శాతం, ఫిలిప్పీన్స్‌ రేటు 14.2 శాతం ఉంది. కానీ భారత పోటీదారు చైనా సేవింగ్స్‌ రేటు మాత్రం దాని జీడీపీలో 46 శాతం ఉంది. 



You may be interested

నేటి వార్తల్లో షేర్లు

Wednesday 19th February 2020

వేదాంత: ఈ కంపెనీకి చెందిన లాంగ్‌ టర్మ్‌ బాండ్లను మొదటి సారి  భారత మార్కెట్లలో విక్రయించనుంది. ఎల్‌ఐసీ 10 ఏళ్ల కాలపరిమితిగల మొత్తం బాండ్లను రూ.2,000 కోట్లు పెట్టి కొనుగోలు చేయాలని భావిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌: వీడియోకాన్‌ టెలీకమ్యూనికేషన్స్‌కు సంబంధించిన రూ.2,041 కోట్ల బకాయిలను టెలికం విభాగం భారతీ ఎయిర్‌టెల్‌కు అనుసంధానించడం వల్ల ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌ బకాయిలు పెరిగే అవకాశం ఉంది. జెట్‌ ఎయిర్‌వేస్‌: కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌(సీఓసీ) బిడ్ల సమర్పణకు ముగింపు

నిఫ్టీ మార్పులతో శ్రీసిమెంట్‌ అప్‌- యస్‌ బ్యాంక్‌ డౌన్‌

Wednesday 19th February 2020

వచ్చే నెల(మార్చి) 27 నుంచి ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీలో చేపడుతున్న మార్పుల నేపథ్యంలో శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. మరోపక్క యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఉదయం 11.20 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో శ్రీ సిమెంట్‌ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 24,503 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 25,200 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మరోవైపు యస్‌ బ్యాంక్‌ 2 శాతం నీరసించి

Most from this category