News


భారత్‌ అవుట్‌లుక్‌ తగ్గించిన మూడీస్‌

Friday 8th November 2019
news_main1573185699.png-29435

భారత క్రెడిట్‌ రేటింగ్స్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి తగ్గిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్‌ ఏజన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రకటించింది. ఇలా రేటింగ్‌ నెగిటివ్‌గా మార్చడం డౌన్‌గ్రేడ్‌కు తొలి మెట్టుగా భావిస్తుంటారు. ఎకానమీలో ఆర్థిక మందగమన భయాలు పెరుగుతున్న తరుణంలో మూడీస్‌ ఈ ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెటరీ లోటు జీడీపీలో 3.7 శాతానికి చేరుతుందని మూడీస్‌ అంచనా వేసింది. ఇది ప్రభుత్వ అంచనా 3.3 శాతం కన్నా అధికం. మందగమనం, పన్ను రేట్ల తగ్గింపు తదితర కారణాలు లోటును పెంచతాయని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌కు మూడీస్‌ బీఏఏ2 రేటింగ్‌ కొనసాగిస్తోంది. రేటింగ్‌ టేబుల్‌లో ఇది కింద నించి రెండో స్థానం. ఇటీవల కాలంలో మందగమన ప్రభావం ఎక్కువ కావడంతో భారత జీడీపీ 5 శాతానికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో తిరిగి 8 శాతం అంతకు మించిన రేటును స్థిరంగా కొనసాగించేందుకు భారత్‌కు తక్కువ ఛాన్సులున్నాయని మూడీస్‌ తెలిపింది.

దీర్ఘకాలిక మందగమనం, ఆదాయ వృద్ధి మసకబారడం, జీవన ప్రమాణాల పెరుగుదల వృద్ధి సన్నగిల్లడం తదితరాలు అధిక వృద్ధిసాధనకు అవరోధాలని మూడీస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ విలియం ఫాస్టర్‌ వ్యాఖ్యానించారు. ఎన్‌బీఎఫ్‌సీలో నెలకొన్న నగదు కొరత అంత తొందరగా సమసిపోదన్నారు. ఇన్వెస్టర్లు దేశీయ ఎకానమీలో ఇంకా బలహీనత కొనసాగుతుందా? అనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారని, ఇదే జరిగితే రేటింగ్‌ మరింత నెగిటివ్‌లోకి జారుతుందన్నారు. ఒకవేళ ఎన్‌బీఎఫ్‌సీ సమస్య తీరితే అది క్రెడిట్‌ పాజిటివ్‌ అంశమని, అప్పుడు బ్యాంకింగ్‌రంగం కూడా ఇబ్బందులు పడకుండా బయటకువస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఫిచ్‌, ఎస్‌అండ్‌పీలు మాత్రం భారత్‌కు స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నాయి. You may be interested

మార్కెట్లోకి హీరో బీఎస్‌-6 స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌

Friday 8th November 2019

ధర రూ. 64,900 న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్‌’.. భారత్‌ స్టేజ్‌–6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌ బైక్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 64,900. ఈ నూతన బైక్‌లో 110సీసీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌ను అమర్చింది. మునుపటి తరంతో పోల్చితే ఇది అధిక టార్క్‌ని, మైలేజిని ఇస్తుందని కంపెనీ వివరించింది. జైపూర్‌లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్

వ్యాపార నిర్వహణకు సౌకర్యంగా ఉండాలి

Friday 8th November 2019

-ఉచిత తాయిలాలు కాదు -ప్రధాని నరేంద్ర మోదీ ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్‌): ఉచిత తాయిలాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పారదర్శకమైన, సులభతర వ్యాపార నిర్వహణకు అనుగుణంగా నిబంధనలు ఉండాలేకానీ, ఉచిత విద్యుత్తు, చౌకగా భూమి, పన్ను రాయితీలు కాదన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించి మాట్లాడారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల (రూ.350

Most from this category