News


క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతమే!

Wednesday 27th November 2019
news_main1574825134.png-29879

  • ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ అంచనా
  • శుక్రవారం కీలక గణాంకాలు

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌)లో 4.7 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ ఫిచ్‌ దేశీయ విభాగం ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ విశ్లేషించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకూ) మొత్తంలో వృద్ధి రేటు 5.6 శాతం దాటబోదనీ తాజాగా అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా  6.1 శాతంగా ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్‌ తగ్గించడం ఇది వరుసగా నాల్గవసారి. శుక్రవారం రెండవ త్రైమాసికం గణాంకాలు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్‌ తాజా అంచనాలను వెలువరించింది. ఈ అంచనాలే నిజమైతే, వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగినట్లవుతుంది. 2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అవుతుంది.  ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కేవలం 5 శాతంగా నమోదయ్యింది. 2013 తరువాత ఇంత తక్కువ స్థాయి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపుసహా పలు ఆర్థిక ఉద్దీపన, సంస్కరణాత్మక చర్యలను కేం‍ద్రం తీసుకుంటున్నప్పటికీ మందగమన ధోరణి నుంచి భారత్‌ బయటపడలేకపోతోంది. ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. ప్రస్తుతం ఇండియా రేటింగ్స్‌ గణాంకాలు అంతకాన్న తక్కువగా ఉండడం గమనార్హం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతం దాటరాదని బడ్జెట్‌ నిర్దేశం. దీనికే కట్టుబడి వ్యయాల కోతకు కేంద్రం సిద్ధమయితే, జీడీపీ వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్‌ 5.6 శాతంకన్నా మరింత తగ్గించే అవకాశం ఉంది. You may be interested

ము‍ద్రా రుణాలకు 'మొండి' భారం

Wednesday 27th November 2019

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన రుణ ఖాతాలపై ఓ కన్నేసి ఉంచాలి బ్యాంకులకు ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్‌ జైన్‌ సూచన  ముంబై: ముద్రా రుణాలకు సంబంధించి మొండిబాకీలు గణనీయంగా పెరుగుతున్నాయని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యుటీ గవర్నర్‌ ఎంకే జైన్‌ హెచ్చరించారు. నిలదొక్కుకోలేని రుణాల వృద్ధితో మొత్తం వ్యవస్థకే ముప్పు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ఇటువంటి లోన్స్‌పై ఓ కన్నేసి ఉంచాలని, నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. "ముద్రా రుణాలతో చాలా మంది లబ్ధిదారులు పేదరికం

కార్వీలో వాటా విక్రయం?

Wednesday 27th November 2019

వ్యూహాత్మక ఇన్వెస్టరుతో డీల్‌ ఖరారు! స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ నుంచి భారీగా క్లయింట్ల వలస- షేర్లను బదిలీ చేయించుకుంటున్న ఇన్వెస్టర్లు అసలు తనఖా మొత్తం ఎంతనేది ఇప్పటికీ సస్పెన్సే- 25-30 కోట్లు మాత్రమేనంటున్న కార్వీ చైర్మన్‌- వాటా విక్రయంతో పూర్తిగా కాకున్నా ప్రస్తుతానికి ఓకే ఖాతాదారుల షేర్లను తనఖా పెట్టి... ఆ డబ్బుల్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించిందనే వ్యవహారంలో కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సర్వీస్‌ నుంచి క్లయింట్ల వలస మొదలైంది. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని సెబీ ఉత్తర్వులివ్వటంతో...

Most from this category