News


పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్‌!

Thursday 10th October 2019
news_main1570681269.png-28795

  • అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో 68వ స్థానం
  • క్రితం ఏడాది 58వ స్థానం
  • నంబర్‌ 1 స్థానానికి సింగపూర్‌
  • రెండో స్థానానికి వెళ్లిపోయిన అమెరికా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌ వెనుకబడింది.  అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ‘గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌’లో క్రితం ఏడాది 58వ స్థానంలో నిలిచిన భారత్‌, ఈ ఏడాది 68కి పరిమితమైంది. ప్రధానంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉండడం భారత్‌ వెనక్కి వెళ్లిపోవడానికి కారణం. కొలంబియా, దక్షిణాఫ్రికా, టర్కీ తమ స్థానాలు మెరుగుపరుచుకుని భారత్‌ను అధిగమించినట్టు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. అంతర్జాతీయంగా అత్యంత పోటీపడగల ఆర్థిక వ్యవస్థగా సింగపూర్‌ అవతరించి ఆశ్చర్యపరించింది. ఈ విషయంలో అమెరికా స్థానాన్ని కొల్లగొట్టింది. బ్రిక్స్‌లోని ఐదు దేశాల్లో భారత్‌, బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థల ర్యాంకులే తక్కువగా ఉండడం గమనార్హం. ఈ సూచీలో బ్రెజిల్‌ 71వ స్థానంలో ఉంది. అయితే, స్థూల ఆర్థిక అంశాల పరంగా స్థిరత్వం, మార్కెట్‌ సైజు పరంగా భారత్‌ ర్యాంకు ఉన్నత స్థానంలోనే ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విషయంలో భారత్‌ ర్యాంకు 15వ ‍స్థానంలో ఉంది. వాటాదారుల గవర్నెన్స్‌ విషయంలో అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలిచింది. మార్కెట్‌ సైజు పరంగా మూడో స్థానంలో ఉంది. ‘‘ఆవిష్కరణల విషయంలో భారత్‌ తన అభివృద్ధి హోదాను మెరుగుపరుచుకుంది. అభివృద్ధి చెందిన దేశాలకు మాదిరే, అధిక శాతం వర్ధమాన దేశాల కంటే ముందుంది. అయితే, ఈ విధమైన సానుకూలతలు ఉన్నప్పటికీ.. పోటీ పరంగా కనీస అవసరాలు లోపించాయి’’ అని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. పరిమిత ఐసీటీ (సమాచార, కమ్యూనికేషన్‌ అండ్‌ టెక్నాలజీ) అమలు, ఆరోగ్య పరిస్థితులు బలహీనంగా ఉండడం, ఆరోగ్యకర ఆయుర్ధాయం తక్కువగా ఉండడం వంటి వాటిని పేర్కొంది. ఆరోగ్యకర జీవనం విషయంలో భారత్‌ 141 దేశాలకు గాను 109 స్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సన్నద్ధంగా లేనట్టు పేర్కొంది. 103 అంశాల ఆధారంగా గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌లో స్థానాలను డబ్ల్యూఈఎఫ్‌ ఏటా నిర్ణయిస్తుంటుంది. మొత్తం 141 దేశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటుంది. 
నైపుణ్యాలను పెంచుకోవాలి
భారత్‌ తన నైపుణ్య పరిధిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూఈఎఫ్‌ సూచించింది. స్వేచ్ఛా వాణిజ్య లేమి కారణంగా ఉత్పత్తుల మార్కెట్‌ సామర్థ్యం బలహీనపడినట్టు పేర్కొంది. కార్మికులకు తగినన్ని హక్కులు లేకపోవడం, చురుకైన కార్మిక మార్కెట్‌ విధానాలు తగినంతగా అభివృద్ధి చేయకపోవడాన్ని ప్రస్తావించింది. పురుష కార్మికులతో పోలిస్తే మహిళా కార్మికుల నిష్పత్తి చాలా తక్కువగా 0.26గా ఉన్నట్టు తెలిపింది. ఈ విషయంలో 128వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది.
వివిధ అంశాల్లో భారత్‌ స్థానం

అంశం  స్థానం
పురుష, మహిళా కార్మికుల నిష్పత్తి    128
యోగ్యత, ప్రోత్సాహకం  118
నైపుణ్యాలు     107
ఆరోగ్యకర ఆయుర్దాయం    109
కార్పొరేట్‌ గవర్నెన్స్‌     15
మార్కెట్‌సైజు     3

కాంపిటీటివ్‌ ఇండెక్స్‌ 2019
వివిధ దేశాల స్థానాలు

దేశం     స్థానం
సింగపూర్‌  
 1
అమెరికా    2
హాంగ్‌కాంగ్‌    3
నెదర్లాండ్స్‌   4
స్విట్జర్లాండ్‌   5
చైనా  28
వియత్నాం 67
శ్రీలంక     84
బంగ్లాదేశ్‌   105



You may be interested

12 పైసలు లాభపడిన రూపీ

Thursday 10th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం ట్రేడింగ్‌లో 12 పైసలు బలపడి 70.95 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌ నుంచి అదనపు వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రభుత్వం ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గత సెషన్లో రూపీ కూడా డాలర్‌ మారకంలో ప్రారంభ

భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్‌!

Thursday 10th October 2019

- ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా - ఒకేసారి మందగమనంలోకి  జారిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ - 90 శాతం ప్రపంచ వృద్ధిపై ప్రభావం వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఆర్థిక మందగమన ప్రభావం భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఒక్కింత ఎక్కువగా ఉండనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు ఒకేసారి మందగమనంలోకి జారిన పరిస్థితులను మనం చూస్తున్నామని పేర్కొన్నారు. అంటే ప్రపంచ ఆర్థిక

Most from this category